ముకేష్ అంబానీ బ్రిటన్ లో కొన్న ఇంటి విలువ ఎంతో తెలుసా..?
ముకేష్ అంబానీకి ముంబైలో ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపర కుబేరుడు ఆయనకి ఎన్ని బిల్డింగ్ లైన్ ఉంటాయి. ఇండియాలోనే కాదు, బ్రిటన్ లో కూడా ఆయన ఒకదాని వెంట ఒకటి బిల్డింగ్ లు కొనేస్తున్నాడు. ఇప్పటికే లండన్ లో ఆయనకి ఓ బిల్డింగ్ ఉంది.
తాజాగా ఆయన మరో పెద్ద భవంతిని కొన్నాడు. ఏకంగా 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాంపౌండ్ లో ఆ భవనం ఉంది. దాని విలువ 592 కోట్ల రూపాయలు. అందులో 49 బెడ్ రూమ్ లు ఉంటాయి. లండన్ లోని బకింగ్ హాంప్ షైర్ ప్రాంతంలో ఈ భవంతి ఉంది. దీనిలోపల ఆస్పత్రి కూడా ఉండటం విశేషం. అక్కడే ఓ డాక్టర్, ఇద్దరు కాంపౌండర్లు ఎప్పుడూ ఉంటారు.
మరో విశేషం ఏంటంటే.. ఇక్కడే ఓ గుడి కూడా నిర్మించారు. గుడి కడితే కట్టారు.. రోజూ నిత్యపూజలకోసం ఇద్దరు పూజారులను కూడా అక్కడికి పిలిపించి వారికి వసతి కల్పించి జీతం ఇస్తున్నారు. ముంబైనుంచి వచ్చిన ఈ పూజారులకు వీఐపీ బస ఏర్పాటు చేశారట. గుడిలో వినాయకుడు, హనుమంతుడు, రాధా కృష్ణుల పాలరాతి విగ్రహాలు ఉంటాయి. వీటిని గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ విషయమై రిలయన్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదలచేసింది.. ఈ భవనం కొనుగోలుమాట నిజమేనని చెప్పింది.. అయితే దానిలో అంబానీ కాపురం ఉండరని , దాన్ని గోల్ఫ్ , తదితర క్రీడలకు వాడాలని నిర్ణయించుకున్నామని ప్రకటన విడుదలచేసింది..
1908 తర్వాత ఈ బిల్డింగ్ ని ప్రైవేట్ హోమ్ గా ఉంచారు. కొన్నాళ్లు కంట్రీ క్లబ్ గా కూడా మార్చారు. ఆమధ్య ఓ జేమ్స్ బాండ్ సినిమా కూడా దీంట్లో పిక్చరైజ్ చేశారు. ముకేష్ అంబానీ చేతిలోకి వచ్చాక ఇది మరింత పాపులర్ అయింది.