సమంతకు సరిజోడీ కావాలంట ..ఎవరో..?

  0
  853

  నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్షన్ లో రూపు దిద్దుకుంటున్న ‘శాకుంతలం’ మూవీని ఆమె పూర్తి చేసింది. మరోపక్క, విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ అనే మల్టీస్టారర్ లో నటిస్తోంది. తాజాగా ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని స‌మాచారం. ఇక‌పై సామ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఇదిలావుంటే, స‌మంత ప‌క్క‌న హీరోని ఎవ‌రిని సెట్ చేయాల‌న్నదే ఇప్పుడు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఆలోచిస్తున్నార‌ట‌. ఫీమేల్ లీడ్ చేసే సినిమాల్లో పెద్ద హీరోలు చేయ‌ర‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.

  మ‌రి కొత్త హీరోల‌ని, వ‌ర్ధ‌మాన హీరోల‌ని పెడితే ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌దే ఇప్పుడు క్వ‌శ్చ‌న్ మార్క్‌. లీడింగ్ లో ఉన్న సామ్ ప‌క్క‌న హీరోగా చేస్తే, త‌మ‌కు క‌లిసి వ‌స్తుందా అనేది కూడా యంగ్ హీరోలు ఆలోచిస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు ప్రొడ్యూస‌ర్స్, డైరెక్ట‌ర్స్ కి ఇదో పెద్ద స‌మ‌స్య‌గా త‌యారైంది. దీంతోపాటు తెలుగులో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతుంది సామ్. అది కూడా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమానే. శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. స‌మంత‌కు వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు అయితే వ‌స్తున్నాయి కానీ… ఇప్పుడొచ్చిన ప్రాబ్ల‌మ్ అంతా హీరో ఎవ‌ర‌నేదే హాట్ టాపిక్.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..