గుహలోనే అన్నీ, కేధారనాధ్ లో విచిత్ర ఏర్పాట్లు

    0
    660

    పరమ పవిత్రమైన కేదారనాధ్ ఆలయం సమీపంలో ఇప్పుడు గుహలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకూ గుహల్లో సాధువులు మాత్రమే జీవించేవారు. ధ్యానం చేసుకుంటూ జనజీవనానికి దూరంగా బ్రతికేవారు. అయితే ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ గుహల్లో ధ్యానం చేశారో, అప్పటి నుంచి గుహలకు భారీ డిమాండ్ ఏర్పడింది. 2019లో ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కేదారనాధ్ సమీపంలోని రుద్ర కేవ్ లో 18 గంటలపాటూ ధ్యానం చేశారు. అప్పట్లో ఈ విషయం మీడియాలో సంచలనం అయింది.

    గుహల్లో మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచీ కేదారనాధ్ వచ్చిన భక్తులు గుహల్లో ధ్యానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గుహలు తక్కువగా ఉండటంతో ఆలయ కమిటీకి ఇదొక తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు అలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉండే కొండల్లో గుహల నిర్మాణం చేపట్టింది. ఈ గుహలు నిర్మాణం పూర్తి చేసుకొని, త్వరలోనే భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ గుహల్లో ఉండాలంటే ఆలయ కమిటీ కొంత రుసుము వసూలు చేయాలని ప్రతిపాదించారు.

     


    ధ్యానం చేయాలనుకునే వారెవరైనా రోజుకి 1500 రూపాయలు చెల్లిస్తే వారికి ఓ గుహను కేటాయిస్తారు. మూడుపూటల భోజనం కూడా ఆలయ కమిటీని అందిస్తారు. గుహల్లోనే వాష్ రూమ్స్ కూడా నిర్మించారు. ధ్యానం చేసుకునేందుకు కొంత స్థలాన్ని కూడా గుహలోపలే కేటాయిస్తారు. అందులో కూర్చొని.. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చని ఆలయకమిటీ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్రమోదీ పర్యటన తర్వాత కేధారనాధ్ ను సందర్శించే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. 2019లో ప్రధాని పర్యటన తర్వాత నుంచి ఇప్పటివరకూ 73 లక్షల మంది భక్తులు కేదారనాధ్ ను సందర్శించారట.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..