రాముడు అరణ్యవాసం సీన్లో , రామ రామ అంటూ గుండె ఆగి..

    0
    739

    మృత్యువు ఎలా ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు.. ఒక్కొక్కరి మరణం ఒక్కోరకంగా ఉంటుంది.. కొందరి మరణం గుర్తుండిపోతుంది.. మరణంలోనూ వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు.. దసరా ఉత్సవాలలో రాముడి తండ్రి దశరధుడి పాత్ర వేస్తున్న రాజేంద్రసింగ్ అనే వ్యక్తి మరణంలోనూ రామనామమే వినిపించింది. ఉత్తరప్రదేశ్ లోని బీజనోరు లో రామ్ లీల నాటకం వేస్తున్నారు. రాముడు అడవులకు పోతున్నప్పుడు దశరధుడు , రామ , రామ అంటూ విలపించే సీన్ అది.. ఆ సీన్లో దశరధుడి వేషధారి రాజేంద్రసింగ్ , రామ , రామ అంటూ విలపిస్తూ అలాగే కుప్పకూలిపోయాడు.. మొదట అందరూ నాటకంలో నటనగానే భావించారు.. అయితే కాసేపటికి చూస్తే , రాజేంద్రసింగ్ గుండెపోటుతో చనిపోయినట్టు తేలింది.. తన జీవితమైన నాటకంలోని రామ నామం ఆలపిస్తూనే ఆయన చనిపోవడం కూడా విశేషమే. గత 20 ఏళ్లుగా రాజేంద్రసింగ్ రామ్ లీలా ఉత్సవాలలో జరిగే నాటకంలో దశరధుడి వేషం వేస్తున్నారు..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..