భార్యపై ఘోరానికి పగ ఇలా తీర్చుకున్నాడు..

  0
  88

  తన భార్యపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని వ్యూహం ప్రకారం బాంబులతో చంపేశాడు. బాంబులు తయారు చేసే విధానాన్ని ఇంటర్నెట్ లో తెలుసుకుని, ఒకటికి రెండుసార్లు దాన్ని ప్రయోగించి చివరిగా హతమార్చాడు. మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాలో 32 ఏళ్ల ఓ వ్యక్తి భార్యపై ఇద్దరు.. ఇద్దరు భూస్వాములు భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారు. అతడిని కట్టేసి, అతడి భార్యపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ లాల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడినప్పటికీ.. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

  అప్పటినుంచి ఒక వ్యూహం ప్రకారం ఇంటర్నెట్ ద్వారా బాంబులు తయారు చేయడం ఎలా అన్న సమాచారం సేకరించారు. ఒక దఫా బాంబు తయారు చేసి లాల్ సింగ్ వ్యవసాయ భూమిలో పంపు సెట్టు వద్ద పెట్టాడు. అది పేలి నిందితుడికే స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పగడ్బందీగా బాంబుని తయారు చేయడం నేర్చుకుని, రెండోసారి లాల్ సింగ్ ని అంతం చేయాలన్న టార్గెట్ తో అతడి బోరు బావి పక్కనే పెట్టాడు. రిమోట్ కంట్రోల్ తో లాల్ సింగ్ ఆ ప్రాంతానికి పోయినప్పుడు దాన్ని పేల్చాడు. లాల్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఈ కుటుంబం గ్రామం నుంచి పారిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణ చేపట్టింది. తన భార్యపై త కళ్లెదుటే సామూహిక అత్యాచారం చేసినందుకు బదులుగా తానీపనికి పాల్పడ్డానని చెప్పాడు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..