పోలీస్ మీ వాట్సప్ చెక్ చేస్తుంది జాగ్రత్త..

    0
    2471

    హైదరాబాద్ రోడ్లమీద తిరిగే వారిని పోలీసులు సడన్ గా ఆపేస్తున్నారు. మీ సెల్ ఫోన్ ఇవ్వండి అని తీసుకుని అందులో వాట్సప్ చాట్ చెక్ చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్.. లాంటి పేర్లు అందులో టైప్ చేసి ఏమైనా చాటింగ్ జరిగి ఉంటుందేమోనని చెక్ చేస్తున్నారు. ఏమైనా ఆధారాలు దొరికితే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

    ఇదెక్కడి న్యాయం..?
    పోలీసులకు అనుమానం వస్తే, నిందితులను చెక్ చేసే అధికారం, వారి ఫోన్లను చెక్ చేసే అధికారం ఉంటుంది. కానీ రోడ్డుపై పోయేవారందర్నీ ఆపి నీ వాట్సప్ చాట్ చూపించు అంటూ ఫోన్ లాక్కోవడం మాత్రం మరీ దారుణం అంటున్నారు కొందరు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది కారం కోమిరెడ్డి పోలీసు చర్యలను ఖండించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని మొదలు పెట్టారు. కొంతమంది పౌరులు కూడా ఈ సెల్ ఫోన్ చెకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు.

    గంజా ఫ్రీ హైదరాబాద్ కోసం..
    ఇటీవల హైదరాబాద్ లో గంజాయి ఎక్కడబడితే అక్కడ దొరుకుతోంది. అసలీ గంజాయి వ్యవహారంపైనే ఏపీలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు ఇలా ప్రజల్ని ఆపి సెల్ ఫోన్లు చెక్ చేస్తున్నారు. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటున్నారు కొంతమంది.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..