ఎమ్మెల్యే రోజాకు ఆపరేషన్.. అసలేం జరిగింది..?

  0
  1983

  ఏపీఐఐసీ చైర్ ‌ప‌ర్స‌న్‌, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ప్రస్తుతం చెన్నై ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు రెండు ఆపరేషన్లు జరిగాయి. ప్ర‌స్తుతం ఆమె చెన్నై అడ‌యార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

  రోజా భ‌ర్త‌, డైరెక్ట‌ర్ ఆర్కే సెల్వ‌మ‌ణి తన భార్య ఆరోగ్యంపై తాజాగా ఓ ఆడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. గతంలోనే ఆమెకు ఈ ఆపరేషన్లు జరగాల్సి ఉన్నా, గతేడాది కరోనా, ఈ జనవరిలో స్థానిక సంస్థ‌ల కారణంగా ఆప‌రేష‌న్లు వాయిదా పడ్డాయని చెప్పారు. రెండు ఆప‌రేష‌న్లు విజ‌య‌వంతంగా జ‌రిగాయ‌ని, అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

  రెండు ఆపరేషన్ల తర్వాత రాత్రి ఐసీయూ నుంచి స్పెష‌ల్ రూమ్‌ కి రోజాను షిప్ట్ చేశారు. రెండు మూడురోజుల్లో య‌థావిధిగా ఆహారం తీసుకుంటారని చెప్పారు. మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

  ప్రస్తుత పరిస్థితు లను దృష్టిలో పెట్టుకుని రోజాను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఎవరినీ ఆస్ప‌త్రి సిబ్బంది అనుమతించడం లేదని ఆయ‌న వివ‌రించారు. అయితే ఆ ఆపరేషన్లు ఏంటా అనేది మాత్రం ఇంకా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు.

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..