రెండోరకం.. అత్యంత భయానకం..

    0
    561

    విదేశాలలో కొత్త రకం కరోనా మనల్ని భయపెట్టే మాట ఎలా ఉన్నా, ప్రస్తుతం మన దేశంలో కనిపిస్తున్న సెకండ్ వేవ్ కరోనా స్ట్రెయిన్ మరింత భయంకరమైనదని, అత్యంత ప్రమాదకరమైనదని, ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. పరిణామం చెందిన ఈ భారతీయ కరోనా వైరస్, విదేశాల్లో వచ్చిన సెకండ్ స్ట్రెయిన్ కరోనా కంటే ప్రమాదకరమైనదని, ఇది అత్యంత వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని అన్నారు.

    https://nextdiaries.com/2021/02/21/herd-immunity-difficult-to-achieve-aiims-director-randeep-guleria/

    ఒక దఫా కరోనా వచ్చినవారికి కూడా మళ్లీ కరోనా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని చెప్పారు. ఒక దఫా కరోనాకు శరీరంలో వ్యాధి నిరోధకాలు తయారయినా, ఇప్పుడు వస్తున్న రెండో రకం కరోనాను అవి అడ్డుకోలేవని హెచ్చరించారు. సామూహిక వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక ఊహాజనితమైన అభిప్రాయమని స్పష్టం చేశారు. దేశ జనాభాలో 80శాతం మందికి కరోనా సెకండ్ స్ట్రెయిన్ ని తట్టుకునే శక్తి లేదని అన్నారు. గతేడాది కరోనా సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో, ఈ సెకండ్ స్ట్రెయిన్ కరోనానుంచి తప్పించుకునేందుకు అంతే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహారాష్ట్రలో 240 కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో గత 24గంటల్లో 14వేల కేసులు నమోదయ్యాయి. గత నెలరోజుల్లో ఇదే అత్యథికం. దేశంలో 5 రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడే నివారణ చర్యలు తీసుకోకపోతే దేశం మళ్లీ కరోనా కబంధ హస్తాల్లో చిక్కే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?