వాడి కామదాహానికి ఒకరు కాదు, ఇద్దరు బలి…

  0
  1923

  ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అమ్మాయిలిద్దరూ అబ్బాయికి బంధువులే. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. చివరికి అందులో ఒకరిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఒకరికే పరిమితం కావడం వాడికి నచ్చలేదు. ఒకరితో వైవాహిక సంబంధం, ఇంకొకరితో అక్రమ సంబంధం నెరపాలనుకున్నాడు. భార్య ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా తిరక్కుండానే సొంత భార్యను పొట్టనపెట్టుకున్నాడు. జ్యూస్ లో మత్తుబిళ్లలు కలిపి ఇచ్చి, స్పృహ తప్పాక అడవుల్లోకి తీసుకెళ్లి ఉరేసి చంపాడు. ఆ వెంటనే అతడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం ఈ కథలో అసలు ట్విస్ట్.

   

  పెళ్లాన్ని చంపిన ఆ కిరాతకుడి పేరు నాగ శేషురెడ్డి. వాడ్ని పెళ్లి చేసుకున్న పాపానికి రెండు నెలలు తిరక్కుండానే తనుచాలించిన అభాగ్యురాలు నవ్యారెడ్డి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామంలో ఈ దుర్మార్గం జరిగింది.

  సినిమా స్టైల్ లో కట్టుకథ

  పెళ్లాన్ని చంపిన ప్రబుద్ధుడు.. వెంటనే ఆమె సెల్ ఫోన్ తీసుకుని మామకి మెసేజ్ పెట్టాడు. ఇంజినీరింగ్ లో బ్యాక్ లాగ్స్ ఉన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశాడు. చివరకి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం బయటపడింది. భర్త బైక్ పైనే భార్య వెళ్లిన విషయాన్ని గమనించిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపడంతో తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు.

  అసలు ట్విస్ట్ అదే..

  కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు నాగశేషురెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతని ప్రేమ వ్యవహారం తెలిసి, అక్రమసంబంధం కలిగిన యువతి సెల్ ఫోన్ కూడా తీసుకున్నారు. దీంతో ఆ యువతి తీవ్ర ఆందోళనకు గురైంది. తమ మధ్య ఉన్న లవ్ ఎఫైర్ బయటపడిపోయిందని, తన పరువుపోతుందని, అందులోనూ ఒకరి మరణానికి కారణమయ్యాననే భావనతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ప్రగళ్లపాడు సమీపంలో రైలు కిందపడి చనిపోయింది ఆ యువతి.

  ఒకరు హత్య, ఇంకొకరు ఆత్మహత్య..

  ఓవైపు పెళ్లాం, ఇంకోవైపు ప్రియురాలితో జల్సా చేద్దామనుకున్న నాగశేషురెడ్డి.. ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. అటు పెళ్లాన్ని హత్య చేశాడు, ఇటు ప్రియురాలు తన ఉసురు తానే తీసుకుంది. ఇద్దరి చావుకి కారణమైన ఈ దుర్మార్గుడిపై కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధితుల బంధువులు.

  ఇవి కూడా చదవండి:

  పెళ్ళైన రెండునెలలకే భార్యను దారుణంగా చంపేశాడు..

  ఈ పెళ్ళాం ఒక కామపిశాచి , భర్తను ఏమిచేసిందో చూడండి..

  పెళ్లి పట్టుచీరను ఎలా చూసుకోవాలో తెలుసా..?