పవన్ తో ఆ రెండు గంటలు నా అదృష్టం అంటున్న ఆషూరెడ్డి…

  0
  867

  పవన్ కళ్యాణ్ తన దేవుడు , ఫస్ట్ లవ్ అని చెప్పుకునే ఆషూరెడ్డి ఇప్పుడు గాల్లో తేలిపోతుంది..తన కలల రాకుమారుడు , తన ఆరాధ్య ప్రియుడు ( వన్ సైడ్ ) పవన్ కళ్యాణ్ తో రెండుగంటలు గడపడం తన అదృష్టమని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన ఆషూ రెడ్డి ,గతంలో తన వక్షోజాల పక్కనే పవన్ కళ్యాణ్ పేరు పచ్చబొట్టుగా వేయించుకుంది. పవన్ తనకు ఇచ్చిన లేఖను కూడా పోస్ట్ చేసింది. ‘మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను’ అని తన దస్తూరితో పవన్‌ కళ్యాణ్ రాసిన లేఖను పోస్ట్‌ చేసింది.

  ఆమెకు శుభాకాంక్షలు చెప్పేవారు పవన్‌ కల్యాణ్‌తో రెండు గంటలు అపాయింట్‌మెంట్ నీకెలా దొరికొందంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. .ఓక నెటిజన్‌ నుంచి ఆమెకు దిమ్మ తిరిగే ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ పవన్‌ కల్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని అడిగితే తప్పకుండా ఓకే చెబుతానంటూ బదులిచ్చింది. ..’నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. దాదాపు 2 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో సంతోషంగా అనిపించింది. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్‌ లెటర్‌ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతఙ్ఞతలు అంటూ పేర్కొంది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?