ఆమె హైదరాబాద్ ఆర్టీఏ లో ఎస్సై.. అతడేమో హోంగార్డ్. ఎక్కడ తంటా వచ్చిందంటే , తమశాఖలో హోమ్ గార్డ్ , తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నదంటూ ఆమె జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోజనం చేసే సమయంలో తీసుకున్న పండ్ల రసం లో మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించి హోమ్ గార్డ్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
తనను నగ్నంగా తయారై , వీడియో కాల్ లో మాట్లాడాలని వత్తిడి చేస్తున్నాడని చెప్పింది. అలా చేస్తూ వీడియో లో అసభ్యకరమైన పనులు చేయాలని కూడా వత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులకి పాల్పడటమే కాకుండా 50 లక్షలు కూడా డిమాండ్ చేసాడని చెప్పింది.
తనను కొన్నేళ్లుగా కొన్నేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ ,మానసికంగా ,శారీరకంగా కూడా వేధిస్తున్నాడని తెలిపింది. బాధిత మహిళ అయిన ఎస్సై పిర్యాదు మేరకు నిందితుడు హోమ్ గార్డుపై పై రేప్ కేస్ నమోదు జూబ్లీహిల్స్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.