జూలై 25 సెంటిమెంట్ వెనుక అసలు కధ..

    0
    439

    1977 తరువాత రాష్ట్రపతులందరి ప్రమాణ స్వీకారం జులై 25నే జరిగింది. ఈ సెంటిమెంట్ ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తేదికి రాజ్యాంగ పరంగా ప్రత్యేకత ఏమీలేదు.. కాకపోతే కేవలం సెంటిమెంట్ ఆధారంగా మాత్రమే జులై 25కు దేశ చరిత్రలో రాష్ట్రపతులందరి ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. భారత ఆరో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన నీలం సంజీవరెడ్డి నుంచి.. 14వ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వరకు అందరూ అదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార తేదీ కూడా జులై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. . రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి జులై 25వ తేదీని ఖరారు చేయడం ఇదే తొలిసారి కాదు.

    గడిచిన 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం విశేషం. ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న ఆ పదవిని అలంకరించారు. అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్‌సింగ్‌ నుంచి.. తాజాగా పదవీ విరమణ చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ వరకు అందరూ ఇదే తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఈ తేదీ వెనుక ఉన్న కథేంటో చూద్దాం..1950 జనవరి 26న డా.రాజేంద్రప్రసాద్‌ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు. 1952 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1957లోనూ ఎన్నికయ్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలంపాటు కొనసాగలేకపోయారు.

    1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.జాకీర్ హుస్సేన్‌ మే 3 1969లో మృతిచెందారు. వీవీ గిరి తర్వాత ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సైతం పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోయారు. అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా 1977 జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తికాలంపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్నవారంతా విజయవంతంగా తమ పదవీ కాలాన్ని ముగించారు. వారంతా జులై 25న బాధ్యతలు స్వీకరించడం.. ఐదేళ్ల తర్వాత జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా మారింది.

    గత 45 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతులు వివరాలు చూడండి.. నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్​ సింగ్​, ఆర్​. వెంకట్రామన్​, శంకర్​ దయాళ్​ శర్మ, కేఆర్​. నారాయణన్​, ఏపీజే. అబ్దుల్​ కలాం, ప్రతిభా దేవి సింగ్​ పాటిల్​, ప్రణబ్​ ముఖర్జీ, రామ్​నాథ్​ కోవింద్​..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.