ఎమ్మెల్యే , ఎంపీ లొద్దు , దున్నపోతే ముద్దు..

  0
  239

  మొత్తానికి భలే ప్రారంభోత్సవం.. అతిధులు మనుషులే.. కాకపోతే ప్రారంభోత్సవం మాత్రం దున్నపోతు పేరుమీదనే జరిగింది.. దున్నపోతు ముఖ్య అతిధిగా , ఆ బస్ షెల్టర్ ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించారు. అనుకున్నట్ట్టే , మేళతాళాలమధ్య దున్నపోతు అక్కడికొచ్చింది.. బస్ షెల్టర్ ప్రారంభం అయింది.. నూతన గృహ ప్రవేశం గోవు తో చేసినప్పుడు , ఇలా కొత్త బస్ స్టాండ్ దున్నపోతుతో ప్రారంభం చేయడం తప్పా అని అనుమానం రావచ్చు.. కాకపోతే , ఈ దున్నపోతు చేత ఓపెనింగ్ చేయించింది , ఎమ్మెల్యే , ఎంపీ , అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా.. అదీ సంగతి.

  అసలు విషయం ఏమిటంటే , కర్ణాటకలోని గడగ్ జిల్లా , భలే హోసూర్ అనే గ్రామంలో , ప్రజలు ఉమ్మడిగా కలిసి , దున్నపోతుని ముందుపెట్టి , గ్రామంలో బస్ షెల్టర్ ప్రారంభం చేశారు. ఈ షెల్టర్ పైకప్పు పడిపోయి పదేళ్ళయింది. ఎమ్మెల్యే , ఎంపీ , అధికారులు పదేళ్లుగా హామీలు ఇస్తూనే ఉన్నారు. పనిమాత్రం జరగలేదు. చివరకు ఆ షెల్టర్ ప్రాంతం చెత్త దిబ్బగా మారింది. దీంతో గ్రామస్తులే చందాలేసుకొని , పైకప్పు నిర్మాణం చేసుకున్నారు. ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రంలో , దున్నపోతు ఫొటో వేసి , అదే ముఖ్య అతిధి అని ప్రచారం చేసి పనికానిచ్చేసారు.. అదీ సంగతి…

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.