అమ్మో షాలిని ,ముంచేసింది..

  0
  982

  కోరివచ్చిన కుర్రదాన్ని చూస్తే ముసలోడికి దసరాపండగలా అనిపించింది. డబ్బంతా పోయిన తరువాత లబోదిబోమంటూ పోలీసులవద్దకు పరుగెత్తాడు ముంబై డిసౌజా అనే వృద్ధప్రేమికుడు. 73 ఏళ్ల తాతకు ఓ యువతి వల విసిరింది. పాపం ముసలాయన పడిపోయాడు. డిసౌజాకు ఆస్తి మాగా వచ్చిన 2 కోట్ల రూపాయలు డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశాడు.ఇటీవలే దానిపై పెద్దమొత్తంలో వడ్డీ వస్తే , దాని విత్ డ్రా చేశాడు. బ్యాంకులోనే పనిచేసే షాలిని కన్ను డబ్బుపై పడింది. తరువాత నేర్పుగా తాతకు లైనేసింది. పరిచయం పెంచుకుంది. మాయమాటలు చెప్పింది. నువ్వంటే నాకిష్టమని నమ్మించింది. ఈ వయసులో నీకు తోడుంటానని , పెళ్లిచేసుకుంటానని నమ్మించింది. మనిద్దరిదీ గత జన్మ బంధమని ప్రేమ వలకబోసింది.

  ముసలి ప్రియుడితో సినిమాలు , షికార్లు..

  ముసలి ప్రియుడిని సినిమాలకు , షికార్లకు , రెస్టారెంట్లకు తిప్పింది. ఒక రోజు నోట్లో అన్నంపెడుతూ , డబ్బులు దాచిపెడితే ఏమొస్తుందని , దాంతో మంచి వ్యాపారం చేద్దామని నమ్మించింది. పాపం ముసలి ప్రేమికుడు , వగలాడి మాటలకు పడిపోయాడు. ఒక కోటి 30 లక్షలరూపాయలు ఇచ్చేశాడు.డబ్బులు తన ఖాతాలో ట్రాన్స్‌ఫర్‌ అయిన వెంటనే మొభైల్‌ స్విచ్ఛాఫ్‌ చేసివేరే ఊరికి మకాం మార్చింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు డిసౌజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..