కండల వీరుడు కావాలని జెల్లీ ఎక్కించుకొని..

  0
  1487

  ప్రపంచంలోనే సెన్సేషనల్ బాడీ బిల్డర్ కావాలన్న దురాశతో చేసిన తప్పుడు పనికి జీవితకాలం పనికిరానివాడుగా మారాడు. రష్యా కు చెందిన కిరిల్ పొపాయ్ కండలు తిరిగిన వీరుణ్ణి కావాలని ఎవరూ చేయని పని చేసాడు. తన చేతుల్లోని పెట్రోలియం జెల్లీలాంటి రసాయనాన్ని ఎక్కించుకున్నాడు. పలుదఫాలుగా ఆరు లీటర్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నాడు. ఇది చేతుల్లో రాయిలాగా గట్టిపడిపోయింది. నరాలు గట్టిపడ్డ కండల్లో ఇరుక్కుపోయాయి. చేతులు కదలలేని పరిస్థితి . తరచూ జ్వరం లాంటి అనారోగాలతో ఆసుపత్రిపాలయ్యాడు. చివరకు కరోనా టైంలో ఆపరేషన్ కుదరదని చెప్పేసారు. ఇప్పుడు పలు రకాల పరీక్షల తరువాత ఆపరేషన్ చేసి , రెండు చేతుల్లో రాయిలా తయారైన కండలను తొలగించారు. లోపల గట్టిపడ్డ కండరాల్లో ఇరుక్కున్న నరాలను కాపాడటం కష్టమైంది. అందుకే ఆపరేషన్ కు ఒక రోజంతా పట్టింది. ఇప్పుడు కిరిల్ ఆసుపత్రిలో ఉన్నాడు..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..