లేడీ టీచర్ పక్కా తాగుబోతు..సస్పెండ్.

  0
  264

  లేడీ టీచర్ పక్కా తాగుబోతు.. మందుకొట్టి స్కూల్ కి వచ్చి , పిల్లలకు పాఠాలు చెప్పకుండా , వారిని బాండ బూతులు తిట్టడం , అకారణంగా కొట్టడం .. ఇలా ఆ తాగుబోతు టీచర్ బాధ భరించలేక పిల్లలు కొందరు స్కూల్ మానేశారు.. చివరకు ఈ టీచర్ , అధికారులకు చిక్కిపోయి , సస్పెండ్ అయింది. కర్ణాటకలోని తుమ్ కూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక స్కూల్లో గంగ లక్ష్మమ్మ అనే టీచర్ ఉంది.. ఆమె మందు కొట్టి స్కూల్ కి వస్తుంది. తూగుతూ , పాఠాలు చెప్పేది. ఒక్కోదఫా , నిద్రపోయేది.. పాతికేళ్లుగా అదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మమ్మ..ఇటీవల ఎక్కువగా తాగి , పాఠశాలకు వస్తోంది. పిల్లలను కొట్టడమే కాకుండా తోటి ఉపాధ్యాయులతో కూడా తగాదా పడేది.

   

  దీంతో విసుగుచెందిన విద్యార్థుల తల్లిదండ్రులు.. తీరు మార్చుకోవాలని ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మను చాలాసార్లు హెచ్చరించారు. తప్పును సరిదిద్దుకోవాలన్న వారి హెచ్చరికలను కనీసం పట్టించుకోకుండా మందు తాగడం మాత్రం ఆపలేదు.చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న విద్యాశాఖ అధికారి హనుమానాయక్‌.. ఘటన గురించి ఆరా తీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదును విన్న ఆయన.. ఉపాధ్యాయిని టేబుల్‌డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు.

   

  దీంతో గ్రామస్థులు తాళాలు విరగగొట్టి చూడగా ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు కనిపించాయి. స్కూల్‌లోనే మద్యం సీసాలను స్టాక్ పెట్టుకోవడం చూసి అధికారికి దిమ్మదిరిగింది.ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన గంగలక్ష్మమ్మ.. తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను సీజ్ చేశారు. ఉపాధ్యాయినిని సస్పెండ్‌ చేసిన విద్యా శాఖ అధికారులు.. ఘటనపై విచారణకు ఆదేశించారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.