ప్రేమ గుడ్డిది.. ధనిక పేద చూడదు. కులం గోత్రం మతం అస్సలే చూడదు. వయసును పట్టించుకోదు. ప్రేమ పుడితే.. ఎదుటి వ్యక్తే సర్వస్వం అనేలా చేస్తుంది ప్రేమ. ఆ ప్రేమ మైకంలోనే ఓ 55 వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది ఓ 18 ఏళ్ళ యువతి. పెద్దలు వద్దన్నా, బంధువులు కాదన్నా.. వారిద్దరూ ఒకింటి వారయ్యారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
మస్కన్.. 18 ఏళ్ళ యువతికి సంగీతమంటే ప్రాణం. పాటలు పాడుతూ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ అందరి దృష్టి ఆకర్షించింది. ఫరూక్ అహ్మద్ అనే 55 ఏళ్ళ వ్యక్తికి సంగీతమంటే అమితమైన ఇష్టం. మస్కన్ పాడే పాటలకు ఫిదా అయిపోయాడాయన. ఆమెను ఉత్సాహపరుస్తూ, బహుమతులు ఇస్తూ, ప్రోత్సహిస్తూ ఆ యువతితో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఫరూక్ తన పట్ల చూపిస్తోన్న ఆదరణకు మస్కన్ మురిసిపోయింది. ఆయనను పెళ్ళి చేసుకోవాలని భావించింది. తొలుత ఆ యువతే 55 ఏళ్ళ ఫరూక్ కు పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది. అది కూడా సినిమా స్టయిల్ లో. పాట పాడుతూ ప్రపోజ్ చేసింది. మస్కన్ ‘బాదల్’ అనే బాలీవుడ్ సినిమాలోని ”నా మిలో హమ్ సే జ్యాదా.. కహీ ప్యార్ హో న జాయే” అనే పాట పాడుతూ ఫరూక్ కి ప్రపోజ్ చేసింది. మస్కన్ చూపిన ప్రేమకు ఫిదా అయిపోయిన ఆయన అందుకు అంగీకరించాడు. ఇద్దరి మద్యా వయసు చాలా తేడా ఉండడంతో పెద్దలు వద్దన్నారు. వారించారు. అయినా ఆ యువతి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చివరికి ఆయననే పెళ్ళి చేసుకుంది.
ఇక ఇలాంటి ఘటనే పాకిస్తాన్ లో అంతకుముందు మరొకటి చోటుచేసుకుంది. నజియా అనే మహిళ కోటీశ్వరురాలు. భర్త లేడు. బంధువులు తోడు లేరు. ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో పనికోసం సుఫియాన్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకుంది. కొంతకాలం కిందట ఆమెకు అనారోగ్యం వచ్చింది. దీంతో సుఫియాన్ ఆమె బాగోగులన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఒకరకంగా కంటికి రెప్పలా కాచుకున్నాడు. సుఫియాన్ చూసిన ఆదరాభిమానులకు నజియా ముగ్ధురాలైంది. అతని ప్రేమలో పడింది. తనను పెళ్ళి చేసుకుంటావా అని అడగడంతో సుఫియాన్ నోటి వెంట మాట రాలేదు. అయితే నజియా పెద్ద మనసుకి పెళ్ళికి అంగీకరించాడు. ఇద్దరూ ఒకింటి వారయ్యారు. యజమానురాలుగా ఉన్నప్పుడు నజియాను ఎంత బాగా చూసుకున్నానో.. పెళ్ళి చేసుకుని భార్యగా స్వీకరించిన తర్వాత కూడా ఆమెను అలాగే చూసుకుంటానని చెప్పుకొచ్చాడు సుఫియాన్. ప్రేమ ఎప్పుడు ఎవరిని ఎలా తనవైపు తిప్పుకుంటుందో.. ఈ సంఘటనలు చూస్తేనే అర్ధమవుతుంది.
ఇవి కూడా చదవండి..