కారు కంటే ఈ గద్ద ధరెక్కువ..

    0
    328

    ఎగ్జిబిష‌న్లు అంటే కార్లు, ఫోన్లు, గృహోప‌క‌ణాలు.. ఏ వ‌స్తువైనా ఎగ్జిబిష‌న్ లో ఉంటాయ‌ని తెలుసు కానీ.. ఓ గ‌ద్దల‌ ఎగ్జిబిష‌న్ ఉంటుంద‌ని తెలుసా ? గ‌ల్ఫ్ దేశాల్లోని ఖ‌త‌ర్ దేశంలో జ‌రిగే గ‌ద్ద‌ల ఎగ్జిబిష‌న్ ప్ర‌పంచ ప్ర‌సిద్ది చెందింది.

     

    ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ ఎగ్జిబిష‌న్ పేరు.. షాహాయిల్ 2022. గ‌త కొన్నేళ్ళుగా జ‌రిగే ఈ అంత‌ర్జాతీయ గ‌ద్ద‌ల ఎగ్జిబిష‌న్‌లో 20 దేశాల నుంచి వ‌చ్చే 108 కంపెనీల‌కు చెందిన గ‌ద్ద‌లు పాల్గొంటాయి. గ‌ద్ద‌లు, కంపెనీలు ఏంట‌ని అనుమానం రావ‌చ్చు.

     

    గ‌ల్ఫ్ దేశాల్లో పెంపుడు గ‌ద్ద‌లు, వేట గ‌ద్ద‌ల‌కు బాగా గిరాకీ ఉంది. ప‌లు కంపెనీలు ఈ గ‌ద్ద‌ల‌కు శిక్ష‌ణ ఇస్తాయి. ఇంట్లో పెంప‌కానికి ప‌నికొచ్చే గ‌ద్ద‌లు కొన్ని అయితే.. వేట గ‌ద్ద‌లు మ‌రికొన్ని. ఈ గ‌ద్ద‌ల‌ను ఉప‌యోగించి వంద‌ల కోట్ల రూపాయ‌ల బెట్టింగులు కూడా జ‌రుగుతుంటాయి.

     

    ఈ గ‌ద్ద‌ల ఎగ్జిబిష‌న్ సౌదీరాజు ప్రారంభించారు. గ‌ల్ఫ్ దేశాల రాయ‌బారులు, ప్ర‌ధాని, మంత్రులు కూడా ఈ ఎగ్జిబిష‌న్ ను చూసేందుకు వ‌స్తుంటారు. విదేశాల నుంచి ఎంతోమంది ప్ర‌ముఖులు ఈ ఎగ్జిబిష‌న్ ను తిల‌కించేందుకు వ‌స్తారు. ఈ ఏడాది గ‌ద్ద‌ల ఎగ్జిబిష‌న్ లో క‌నీసం ఒక్కో గ‌ద్ద ధ‌ర ఐదున్న‌ర ల‌క్ష‌ల నుంచి మొద‌లైంది.

     

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.