భార్య ఫైటింగ్..భర్త షూటింగ్..

  0
  1177

  టోల్ ప్లాజా క‌ట్ట‌కుండా వెళ్ళిపోయే వారు కొంద‌రైతే… టోల్ క‌ట్ట‌మ‌న్నందుకు దాడి చేసే వారు మ‌రికొంద‌రు. అయితే ఈసారి గొడ‌వ పురుషుల‌ది కాదు. మ‌హిళ‌ల‌ది. జుట్లు జుట్లు ప‌ట్టుకుని ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘ‌ట‌న మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న పింపాల్ గావ్ అనే టోల్ ప్లాజా దగ్గర జరిగింది.

  వివ‌రాల్లోకి వెళితే… పింపాల్ గావ్ టోల్ ప్లాజా వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ కారుకి ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో టోల్ క‌ట్టించుకునేందుకు విధుల్లో ఉన్న మ‌హిళ‌.. క్యాష్ క‌ట్టి వెళ్ళాల‌ని కోరింది. అయితే కారు డ్రైవ్ చేస్తున్న వ్య‌క్తి కింద‌కి దిగి, విధుల్లో ఉన్న ఆ మ‌హిళ‌ను కొట్ట‌డంతో ఆమె నిల‌దీసింది. ఈలోగా ఆయ‌న భార్య కారులో నుంచి దిగి, ఆమెను ప‌ట్టుకుని బ‌య‌ట‌కి లాగింది. ఇంకేముంది ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. మాట‌లు కాస్తా చేత‌ల దాకా వెళ్ళింది.

   

  ఒక‌రి జుత్తు మ‌రొక‌రు ప‌ట్టుకుని తెగ కొట్టేసుకున్నారు. ఈ గొడ‌వ‌నంతా ఆమె భ‌ర్త వీడియో తీస్తూ నిల‌బ‌డ్డాడు. ఇక టోల్ సిబ్బంది కూడా చోద్యం చూస్తున్నారే త‌ప్, ఇద్ద‌రినీ విడ‌దీసేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. ప‌ది నిమిషాలు సినిమా చూసిన త‌ర్వాత గానీ, వీరిని వేరు చేయ‌లేక‌పోయారు అక్క‌డున్న వాళ్ళు. కారులో వ‌చ్చిన వ్య‌క్తి సీఆర్పీఎఫ్ కి చెందిన వ్య‌క్తి అని, గొడ‌వ‌కు దిగింది ఆమె భార్య అని తెలిసింది. స‌మాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్ప‌డిన వారిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.