ఈ ట్రాలీ రోడ్డెక్కాలంటే 28 మంది ఉండాలి..

    0
    820

    బండెనక బండికట్టి పదహారు బండ్లుకట్టి అంటూ అప్పట్లో పాటలు పాడుకుంటూ ఉండేవారు.. అయితే ఈ రోజుల్లో పదహారు బండ్లు ఒకేగా వెళ్లాలంటే కుదరని పని.. ఈ రోజుల్లో ఎక్కడచూసినా విపరీతమైన ట్రాఫిక్ కూడా ఓక కారణం. అయితే ఇలాంటి రోజుల్లో కూడా ఓ భారీ వాహనం రోడ్డుపై వెళుతూ కనిపించింది. ఏకంగా 256 టైర్లు కలిగిన ఈ భారీ వాహనం రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా ఆగిపోవాల్సిందే.. ఆ భారీ వాహనం వెళ్లే వరకూ సైడై పోవాల్సిందే.. అంతగా ఆ వాహనం అందరినీ ఆకర్షిస్తోంది. ఏఈ భారీ వాహనం హరిద్వార్ నుంచి కండ్ల పోర్ట్ వరకూ ప్రయాణించింది. ఈ వాహనంలో పవర్ ప్లాంట్ స్టాటర్ ను రవాణా చేశారు.

     

    ఈ వాహనం రోడ్డు మీదకు రావాలంటే మొత్తంగా 28 మంది స్టాఫ్ పనిచేయాల్సి ఉంటుంది. డ్రైవర్లు, క్లినర్లు, అసిస్టెంట్లు, ఫ్యూయల్ చెక్ చేసేందుకు ప్రత్యేకంగా నియమించబడిన సిబ్బంది..రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సిబ్బంది, ఇలా ఎంతోమంది ఏకకాలంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ వాహనం ఒక్క కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే దాదాపుగా నాలుగు లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. JHP అనే ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఈ రవాణా బాధ్యతలను చూసుకుంది.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.