భర్త అంటే ఆ భార్యకి ఎంత ప్రేమో చూడండి. తన తల్లిని చంపినా కూడా ఆయన్ను ఏమీ చేయొద్దు.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని మాత్రమే చెప్పింది. ఆయన ఆయుష్షుకోసం భార్య కార్వా చౌత్ దీక్ష చేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో గొడవలు జరిగాయి. భార్య తల్లిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య విషయంలో భార్య పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త రాజీవ్ గులాటి తన తల్లిని చంపేశాడని, ఆయన్ను వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పింది. అరెస్ట్ మాత్రమే చేయాలని, ఎన్ కౌంటర్ మాత్రం చేయొద్దని చెప్పింది. తాను కార్వాచౌత్ దీక్షలో ఉన్నానని, ఆ దీక్ష సఫలం కావాలని, ఆయన నిండు నూరేళ్లుబతకాలని, అదే సమయంలో ఆయన చేసిన తప్పుకి శిక్ష తప్పనిసరిగా అనుభవించాలని చెప్పింది. ఆ ఫోన్ కాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి రాజీవ్ గులాటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. భార్య పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నారు.