హారికను ఎందుకు తీసేసారు..?

  0
  945

  తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారికను నియమించడం వివాదాస్పదం అయింది. టూరిజం శాఖ మంత్రికి కానీ, ఆ శాఖలో ఇతర అధికారులకు తెలియకుండా, కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా ఈమెను నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు నియామక పత్రం కూడా అందజేశారు. బిగ్ బాస్ సీజ్ – 4 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ కూడా అయిన హారికకు ఏ విధంగానూ తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం పొందే అర్హత లేదు. సాధారణంగా బాగా పేరున్న సినీ హీరోలను, హీరోయిన్లను కానీ, లేదా ఇతర రంగాల సెలబ్రిటీలను కానీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తారు.

  బ్రాండ్ అంబాసిడర్లుగా నియామకం పొందినవారికి భారీగా పారితోషికం కూడా ఇస్తారు. అయితే హారిక ఏ విధంగానూ బ్రాండ్ అంబాసిడర్ పదవికి సరిపోదు, ఆమెకు ఆ స్థాయి కూడా లేదు. కనీసం టీవీ సీరియల్స్ లో కూడా ప్రముఖ నటి కాదు. యూట్యూబ్ లో కొన్ని కొన్ని వీడియోలు చేస్తూ మినీ స్కర్ట్ లు వేస్తూ షో లు చేయడం ద్వారా మాత్రమే ప్రచారం పొందిన హారిక నియామకం ఇప్పుడు వివాదాస్పదం అయింది.

  టూరిజం మంత్రి శ్రీనివాస్ , మంత్రి కేటీఆర్ కూడా ఆమె నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తమకు తెలియదని అన్నారు.  దేత్తడి హారిక పోస్టింగ్ పై వివాదం చెలరేగడంతో ఆమెను బ్రాండ్ అంబాసిడర్ పదవినుంచి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఈ గొడవతో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇబ్బందుల్లో పడ్డారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..