మనుషుల్లా పుట్టినా ,దెయ్యాల్లా బ్రతకాలని..

    0
    3476

    అందం కోసం లక్షలు ఖర్చుపెట్టే కాలంలో , దెయ్యాల్లా ఉండేందుకు మొగుడూ పెళ్ళాలు ఉన్న ఆస్తిమొత్తం ఖర్చుపెడుతున్నారు. మనుషుల్లా పుట్టినా , తమకు దెయ్యాల్లా బతకడం ఇష్టమని , అందుకే ముక్కు , చెవులు , కళ్ళు , ముఖం ..ఇలా శరీరంలోని ప్రతిభాగాన్ని సైతాన్ లా మార్చుకుంటున్నారు..

    బ్రెజిల్ కు చెందిన మిచెల్ ఫారో డిఫ్రాదో అనే టాటూ మ్యాన్ ఇప్పుడు మనిషిలా లేదు.. నాలుకను ఆపరేషన్ ద్వారా రెండుగా చీల్చుకున్నాడు. పాము నాలుకలాగా తయారైంది.. ముక్కు కొనలు ఆపరేషన్ చేసి తీయించేసాడు.. పెదాలు దూడ పెదాలు మాదిరిచేసి , రెండు వెండి కోరలు చేయించి అతికించుకున్నాడు. వళ్ళంతా బొడిపెలు , తలపై రెండు చోట్ల కొమ్ములు లాంటి ఆకారాన్ని ఆపరేషన్ చేయించి పెట్టించుకున్నాడు. చేతి వేళ్లను కూడా కట్ చేయించుకున్నాడు..

    తాను ఇలా ఉండటం తన భార్యకు ఇష్టమని చెప్తున్నాడు. ఫారో డిఫ్రాదోకే కాదు , అతడి భార్య కరోల్ కూ అదే పిచ్చి.. ఆమె కూడా సైతాన్ లా తయారైంది.. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం.. కాకపోతే వీళ్లకు దెయ్యాల పిచ్చి..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?