ఆ వినాయక విగ్రహానికి 316 కోట్ల ఇన్సూరెన్స్.

    0
    884

    వినాయక చవితి పండుగ అంటే చాలు.. అందరికీ ఎంతో సందడి తెస్తుంది.. వినాయక చవితికి కోసం చిన్నారుల మొదలుకొని.. కోటీశ్వరుల వరకూ ఎంతో ఖర్చు చేస్తుంటారు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా వినాయకచవితి పండుగను గొప్పగా జరుపుకోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం వినాయకచవితికి ఘనంగా జరుపుకునేందుకు అందరూ రెడీ అయిపోతున్నారు. వాడవాడలా వినాయకచవితికి జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

    తాజాగా బాంబేలో గౌడ్ సరస్వత్ బ్రహ్మీన్ సేవా మండల్.. (GSB )ఆధ్వర్యంలో వినాయక చవితి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కింగ్స్ సర్కిల్ లో ఏర్పాటు చేసే వినాయక మండపం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసే వినాయక మండపం చాలా ఖర్చుతో కూడుకొన్నది. దీంతో పాటుగా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది 316 కోట్లతో మండపం మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల్లో కోట్లాది రూపాయల బంగారం, వజ్రాలు, కెంపులు, స్వామివారికి అలంకరిస్తారు. అందుకే న్యూ ఇండియా అస్సురెన్సు అనే ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఇన్సూరెన్స్ చేయించారు.

    31 కోట్ల 97 లక్షలు బంగారు, వెండి నగలకి ఇన్సూరెన్స్ చేశారు. వంటవాళ్ళకు, పూజారులకు, స్టాల్, సెక్యూరిటీ గార్డ్స్, సిబ్బందికి 263 కోట్లు.. పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేశారు. ఫైర్, భూకంపాలకు సంబంధించి కోటిరూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. భక్తులకు మరో 20 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఈ ఉత్సవాల్లో 66 కిలోల బంగారు.. 295 కిలోల వెండి ఆభరణాలతో గణనాధుని అలంకరించనున్నారు. 2016 లో కూడా 300 కోట్లతో ఈ మండపానికి ఇన్సూరెన్స్ చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా వినాయక చవితి చేయకపోవడంతో.. ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.