ప్రియురాలితో ఖైదీ , బయట పోలీసు కాపలా.

  0
  987

  జైల్లో ఉండాల్సిన కరడుగట్టిన నేరస్తుడు , లాడ్జిలో ఉన్నాడు.. అయితే ఒక్కడేలేడు.. ప్రియురాలు తోడుగా , ఎస్కార్ట్ పోలీసులు రూమ్ బయట కాపలా ఉండగా , ఈ నేరస్తుడు గదిలో సరసాల్లో మునిగితేలాడు.. చివరకు ఏమైందో చూడండి. ఇదెక్కడో విదేశాల్లో జరిగింది కాదు.. ఇలాంటి నీచ , నికృష్ట పనులన్నీ మన దేశంలోనే జరుగుతాయి.. ఇది జరిగింది కర్ణాటకలో .. బచ్చా ఖాన్ అనే వాడు పేరుమోసిన నేరస్తుడు. వాడిపై కర్ణాటకలోనే , వివిధ ప్రాంతాల్లో అనేక కేసులున్నాయి.

  ప్రస్తుతం బచ్చా ఖాన్ పోలీసు ఎస్కార్ట్ తో , ధార్వాడ్ లోని కోర్టులో ఒక కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిఉంది. ఓ కేసులో వాడిని అదుపులోకి తీసుకున్న , బళ్లారి [పోలీసులు , ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం ధార్వాడ్ తీసుకెళ్లారు. మరుసటి రోజు కోర్టుకు హాజరుపరచాల్సిఉంది. సాధారణంగా అయితే , పోలీస్ స్టేషన్లో పెడతారు. కానీ ఈ ఎస్కార్ట్ పోలీసు , బచ్చాఖాన్ ని , ఒక లాడ్జిలో పెట్టారు. ఇదే అదనుగా , బచ్చా ఖాన్ తన ప్రియురాలిని లాడ్జీకి పిలిపించుకొని , గదిలో ఉంచుకొని , బయట పోలీసుని కాపలా ఉండమన్నాడు. ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ అక్కడే మకాం వేశాడు.

  ఈ విషయం తెలిసిన ధార్వాడ పోలీసులు వెంటనే లాడ్జిపై దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్‌ స్టేషన్‌కు పట్టుకెళ్లారు. నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ యోగీష్‌ ఆచారి, పోలీస్‌ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్‌ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసాడని తెలిసింది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.