ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు అమ్మాయిలు , అబ్బాయిలు , ఒకరి ఒడిలో ఒకరు కూర్చుని నిరసన తెలిపిన , త్రివేండ్రం లోని శ్రీకార్యం బస్టాండ్ వెయిటింగ్ షెడ్ ని స్థానికులు కూల్చేశారు.. దీనిపై రభస జరగడంతో , మేయర్ ఆ ప్రాంతానికొచ్చి విద్యార్థులకు మరో షెడ్ నిర్మించి ఇస్తామని చెప్పారు.
త్రివేండ్రం లోని సియిటి కాలేజీ విద్యార్థులు , కాలేజీ బయటనున్న ఈ బస్ స్టాప్ లో నిరంతరం , ఉండిపోతున్నారు. జంటలు , జంటలుగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఒక్కో దఫా పొద్దుపోయినా పోకుండా బస్ స్టాప్ లోనే , ముచ్చట్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళు.. దీంతో గ్రామస్తులకు ఒళ్ళుమండి , బస్టాప్ లో పొడవాటి బెంచీలను , మూడు ముక్కలు చేశారు.
తరువాత , విద్యార్థులు , దీనికి నిరసనగా , సింగల్ బెంచీలో ఒకరిపై మరొకరు కూర్చొని , వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని ఇలా నిరసన తెలిపారు. గ్రామస్తులే , బస్టాప్ లో బెంచీలను ఇలా చేశారని ఆగ్రహించి , అప్పటినుంచి , అమ్మాయిలు , అబ్బాయిలు ఒకరి వడిలో , ఒకరు కూర్చుని ఫొటోలు షేర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో గ్రామస్తులకు వళ్ళుమండి , ఏకంగా బస్ షెడ్ నే కూల్చేశారు.. దీంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. త్రివేండ్రం మేయర్ కాలేజీ దగ్గరకొచ్చి , విద్యార్థులకోసం మరో కొత్త బస్టాప్ కట్టించి ఇస్తామన్నారు..
ఇవి కూడా చదవండి..