చనిపోయిన మహిళతో ఈ వాలంటీర్ ఏం చేశాడో చూడండి..

    0
    1123

    రాష్ట్రంలో మార్చి నెలకు సంబంధించి ఈ ఉదయం నుంచి వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే పింఛన్ల పంపిణీకి వెళ్లిన ఓ వాలంటీర్ ఓ ఇంటి వద్ద అత్యుత్సాహం చూపించాడు. చనిపోయిన మహిళ వేలిముద్రలు తీసుకుని వారి కుటుంబ సభ్యులకు పింఛన్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా దాన్ని ఫొటో తీయించుకున్నాడు. ఇంకేముంది ఫొటో సాక్ష్యంతో ఆ వార్త వైరల్ గా మారింది. వాలంటీర్ పై చర్య తీసుకోడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

    విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారింది. గ్రామంలో ఇజ్జిరోతు త్రినాథ్ అనే వ్యక్తి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఎర్ర నారాయణ అనే మహిళ చనిపోయినా ఆమె వేలిముద్ర తీసుకుని వాలంటీర్ పింఛన్ ఇచ్చేశాడు. గ్రామస్థులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల మెప్పు కోసమే వలంటీర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

    ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని సుబ్బారావు తెలిపారు. ఘటనపై విచారణకు పీడీ ఆదేశించారు. గుర్ల ఎంపీడీవో‌ను విచారణ అధికారిగా పీడీ నియమించారు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..