వంగవీటి మోహనరంగా.. ఇప్పుడీపేరు రాజకీయాల్లో ప్రముఖంగా వినపడుతొంది.. ఇప్పటివరకు రంగా పేరెత్తని , రంగా పేరుతో జయంతులు , వర్థంతులేకాదు , ఆ పేరు పలకడానికే ఇష్టపడని నేతలు కూడా ఇప్పుడు రంగ భజన చేసున్నారు.. అసలు కథేమిటో చూడండి.. వైసిపి నేతలు కూడా ఇప్పటివరకు రంగా ఊసెత్తని వాళ్ళే.. జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలవరకు వంగవీటి రంగా పేరెత్తలేదు. ఇప్పుడు రంగా పేరునే తారక నామంగా జపిస్తున్నారు.
మూడు పార్టీలు కూడా రాజకీయ అవసరాలకు , కాపు కులం ఓట్లకోసమే ఇప్పుడు , 35 ఏళ్ళ తరువాత రంగా నామజపం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కాపులు ఓట్లు పడలేదన్న అభిప్రాయం టిడిపిలో ఉంది. ముద్రగడ విషయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం , చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి వల్లనే , కాపు కులం టిడిపికి దూరం అయిందన్న వాస్తవాన్ని టిడిపి నేతలు బహిరంగంగా ఒప్పుకోవడంలేదు. పవన్ కళ్యాణ్ కూడా , అప్పట్లో తనకు కులం లేదంటూ , కాపుల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరమయ్యాయి.
ఇప్పుడు , ఒక పధకం ప్రకారం , జనసేన కూడా రంగా ఇమేజ్ ని స్వంతం చేసుకోవాలని చూస్తోంది. టిడిపి కూడా అదే అజెండాగా ముందుకు పొతొంది. వైసిపి కూడా రంగ నామజపంలో మునిగిపోయింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు రంగా మీద ఇలా రాజకీయ ప్రేమలు పుట్టుకొచ్చాయి. మొత్తానికి వంగవీటి రంగా మొనగాడని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు.. ఒకప్పుడు రంగా కృష్ణ, గుంటూరు , జిల్లాలో తిరుగులేని నాయకుడు., పేదలకోసం పాటుపడిన నాయకుడు.
తన సోదరుడు వంగవీటిరాధ హత్య తరువాత , యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదప్రజలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ తో , నిరాహార దీక్షలో ఉండగా , 1988 , డిసెంబర్ 26 తేదీ వేకువజామున దేవినేని నెహ్రు అనుచరులు దాడిచేసి దారుణంగా చంపేశారు. రంగా , ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా , చూస్తూ ఉండిపోయారు. వంగవీటి రంగా హత్యతరువాత , రాష్ట్రం అట్టుడికింది. ఈనాడు కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. రాష్ట్రంలో అంతకుముందెన్నడూ లేనివిధంగా , 70 మున్సిపాలిటీల్లో కర్ఫ్యూ విధించారు. వారం రోజులైనా అల్లర్లు తగ్గలేదు. ఇది ఇప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనం.. అలాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఇప్పటివరకు పట్టించుకోని మూడు పార్టీల నేతలు ఇప్పుడు భజన మొదలు పెట్టారు.. ఇదంతా కేవలం కాపుఓట్లకోసం వేసే గాలం మాత్రమే..
ఇవి కూడా చదవండి..