టైగర్ నాగేశ్వరరావు వచ్చేస్తున్నాడు..

  0
  156

  స్టూవర్ట్ పురం గురించి, స్టూవర్ట్ పురం దొంగల గురించి తెలిసిన వారికి టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పాల్సిన పనిలేదు. రాబిన్ హుడ్ తరహాలో దొంగతనాలు చేయడం, పేదలకు పంచిపెట్టడం అతని జీవనం. అయితే అతడ్ని కేవలం దొంగగానే చూడకుండా.. అతనిలో చాలా మంచి కోణాలు ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హీరో రవితేజ. టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

  ‘అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్‌ నాగేశ్వరరావు కూడా’ అని చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ ట్వీట్ చేసింది. స్టూవర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా ‘టైగర్‌’ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో చెన్నై జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని అంతమొందించారు. ఈ కథతో ఇప్పుడు సినిమా రాబోతోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..