ఆదివారం ఇవి చేస్తే దరిద్రమే ఎందుకో చూడండి.

    0
    275

    ఆదివారం వచ్చిందంటే అనందం..మాంసాహారులకైతే పండగే.. సండే చికెన్ , మటన్ , అలవాటు ఉంటే ముక్కతో చుక్క లేనిదే రోజుగడవదు.. , అందుకే ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. అయితే హిందూమతాచారం ప్రకారం ఆదివారం చాలా పవిత్ర రోజు అని వేదం చెబుతొంది. యుగయుగాలనుంచి మహాఋషులనుంచి , సామాన్యులవరకు . సూర్యోపాసకులు..సూర్యుణ్ని ఆరాధించే సంప్రదాయం హిందుత్వానికి మూలం. .

    సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం.సకల చరాచర జీవరాశికి ఆయనే మూలం. ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి. సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది, ఇంగ్లీషోడి మోజులో పడి , మనం ఆదివారాన్ని జల్సాగా ఎంజాయి చేస్తున్నాం కానీ , ఆదివారం ఎంత మంచి రోజో , ఎంత పవిత్రమైందో చూడండి. దీనికి ఒక శ్లోకం చూడండి..

    అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
    సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

    స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
    న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||

    దీని అర్ధం ఏమిటంటే

    మాంసం తినడం..! మద్యం తాగడం..!స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!తలకు నూనె పెట్టుకోవడం..! ఇవన్నీ కూడా ఆదివారంనాడు చేయకూడదు , అవి నిషిద్ధం. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా మనం ఆదివారమే చేస్తాం.. అదే మన ప్రత్యేకత.ఆదివారం రోజు శాస్త్ర నిషిద్దమైన పనులు చేసినవారు అన్నీ ఉన్నాఏదో ఒక అనర్దంతో జీవితంలో బాధపడతారని శాస్త్రం చెప్పింది.
    అంటే కుటుంబ సౌఖ్యం లేకపోవటం, ఆనారోగ్యం పాలుకావడం , మనశాంతి దూరం కావడం , బిడ్డలు అభివృద్ధిలోకి రాకపోవడం ఇలాంటివి జరుగుతాయట, మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు, ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here