మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారా ? ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా ? గతంలో తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ రాజకీయ రంగు వేసుకుంటున్నారు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదివరకే వైసీపీ నాయకులు కొందరు ఆయన ఇంటిలో కలిసి చేతులు కలిపారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి, కోస్తా జిల్లాలో చేసిన పర్యటన అనూహ్యంగా విజయవంతం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ను అవహేళన చేస్తూ ముద్రగడ రాసిన లేఖ వివాదాస్పదమైంది. ఈ లేఖ తర్వాత ముద్రగడను కాపు సంఘాలు, కాపు యువత బూతులతో చెండాడారు. కాపు కులంలో ఒక పెద్దగా ఉన్న ముద్రగడపై ఊహించని రీతిలో ఈ విధమైన దాడి మొదలైంది. అనూహ్యంగా కాపు కులంలోనూ వపన్ కు అనుకూలత పెరిగింది.
దీంతో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు రెండో లేఖ సంధించారు. తనను కాపులతో పవన్ తిట్టిస్తున్నాడంటూ ఆడిపోసుకున్నారు. ఇష్టం లేకపోయినా విధి లేని పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావడానికి పవన్ ప్రోత్సహిస్తున్నాడని లేఖలో వ్యాఖ్యానించారు. ఎన్నికల యుద్దానికి సిద్ధమని కూడా ప్రకటించేశారు.. అయితే ముద్రగడ వ్యవహారశైలి అంతా వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..