రాత్రి ఎక్కువ, పగలు తక్కువ..భలే ప్లాన్

    0
    232

    పిచ్చి తుగ్లక్కులను చరిత్ర మరిచిపోయింది. ఇప్పుడు కొత్తరకం తెలివైన తుగ్లక్లు అధికార గణంలోనూ, పాలకవర్గంలోనూ బోలెడంత మంది ఉన్నారు. అటువంటి వారు తీసుకున్న నిర్ణయమే కొత్తగా రాబోతున్న కరెంటు చార్జీల విధానం. రాత్రి అయితే ఎక్కువ ధర, పగలైతే తక్కువ ధర. ఇది రాబోయే కరెంట్ చార్జీల కొత్త పద్ధతి. దీన్ని టైమ్ ఆఫ్ ది డే విధానంగా అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరు రాత్రి సమయాల్లో కరెంటు ఎక్కువ వాడతారు. పగలు తక్కువ వాడుతారు.ఇప్పుడు అధికారుల ఆలోచనలలో రూపుదిద్దుకుంటున్న కొత్త విధానం ప్రకారం రాత్రిపూట వాడే కరెంటుకు ఒక ధర, పగలు వాడే కరెంటుకు మరో ధర ఉంటుందట.

    ఉదయం వేళల్లో కరెంటు వాడితే 20% వరకు చార్జీల భారం తగ్గుతుంది. అయితే రాత్రి కరెంటు వాడే వాళ్లకు 10 నుంచి 20% వరకు అధిక భారం పడబోతోంది. అంటే రాత్రిపూట ఇక కరెంటు వాడొద్దని మన పాలకులు అధికారులు సూచించబోతున్నారా.. ? కరెంటు ఉండేదే రాత్రి వాడుకునేందుకు, చదువుకోవాలన్నా , పనిచేసుకోవాలన్నా , నిద్రపోవాలన్నా, నడవాలన్నా ఏమి పని చేయాలన్నా , కరెంట్ అవసరం చీకట్లోనే. చీకట్లో కరెంట్ వేసుకుంటే అధిక చార్జీలు , పగల కరెంటు వేసుకుంటే తక్కువ ఛార్జీలు. దీన్ని తుగ్లక్ విధానం అనక మరేమంటారు..? రాబోయే ఈ విధానంలో మొట్టమొదటిగా దీన్ని వాణిజ్య ,వ్యాపార పారిశ్రామిక రంగాలలో అమలులోకి తీసుకొస్తారట. ఆ తర్వాతనే వినియోగదారులకు దీన్ని అమలు చేస్తారు . ఏ రంగంలో ఈ మార్పు తీసుకొచ్చినా చివరిగా ఆ భారం భరించేది సామాన్యుడే అన్నది నిజం.

    ఇప్పటికే 10 కిలో వాట్ అంతకంటే ఎక్కువ కరెంటు వాడే సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తారట. ఇందులో వ్యవసాయ విద్యుత్తుకు మాత్రం మినహాయింపు ఇస్తారట. ఇళ్లలో వాడే విద్యుత్తు విషయంలో తరువాత అమలు చేస్తారు. దీంట్లో ఎంత కరెంటు వాడేమో ఏ టైంలో వాడుతున్నాము అన్న విషయం తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైన మీటరింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారని చెబుతున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఒకే ఒక్కటి. గ్రిడ్జ్ మీద భారం తగ్గించేందుకు రాత్రి ఒక ధర పగలు ఒక ధర కరెంటు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర మంత్రి సెలవిస్తున్నారు . అంటే కరెంటు ఉండేది రాత్రి వాడుకునే దానికి తప్ప, పగలు కాదుకదా ..? ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్టుంది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here