పెళ్ళి కోసం తాత ‌క‌రెంట్ స్థంభం ఎక్కాడు

  0
  457

  పెళ్ళి చేయ‌మ‌ని ఇంట్లో కుర్రాళ్ళు గోల చేయ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే న‌లుగురు బిడ్డ‌లు, మ‌నుమ‌లు, మ‌నుమ‌రాళ్ళు ఉన్న ఓ వ్య‌క్తి త‌న‌కు పెళ్ళి చేస్తారా .. చేయ‌రా .. అంటూ ఏకంగా క‌రెంట్ స్థంభం ఎక్కేశాడు. క‌రెంట్ తీగ‌లు ప‌ట్టుకుంటానంటూ బెదిరించాడు. జైపూర్ కి స‌మీపంలోని డోలాపూర్ కి చెందిన 60 శోబ్రాన్ సింగ్ కు ఐదుగురు పిల్ల‌లు. వీరంద‌రికీ పెళ్ళిళ్ళై పిల్ల‌లు కూడా ఉన్నారు. నాలుగేళ్ళ క్రితం అత‌ని భార్య చ‌నిపోయింది. అప్ప‌టి నుంచి రెండో పెళ్లి చేసుకుంటానంటూ చెబుతున్నాడు. అయితే కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రూ అంగీక‌రించ‌లేదు. దీంతో మ‌ళ్ళీ పెళ్ళి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. దీంతో గొడ‌వ జ‌రిగింది. త‌న‌కు పెళ్ళి చేయ‌క‌పోతే క‌రెంట్ తీగ‌లు ప‌ట్టుకుని చ‌నిపోతానంటూ స్థంభం ఎక్కేశాడు. గ్రామ‌స్తులు అక్క‌డికి వెళ్ళి బ‌తిమాలినా విన‌లేదు. కుటుంబ‌స‌భ్యులు స‌బ్ స్టేష‌న్ కు ఫోన్ చేసి క‌రెంట్ స‌ర‌ఫరాను నిలిపివేయించారు. క‌రెంట్ స‌ప్ల‌య్ నిలిచిపోవ‌డంతో అంద‌రూ బ‌తిమాలి అత‌న్ని కింద‌కు దించాడు. పెళ్ళి విష‌యం త‌ర్వాత మాట్లాడుకుందాం అంటూ ఇంటికి తీసుకెళ్ళారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..