సోనూ సూద్ లోన్ మేళా.. ఎవరికిస్తారో తెలుసా..?

    0
    4709

    నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ లో పేదలకు సాయం చేసి హీరోగా నిలిచాడు. కష్టం ఉంటే ఏ అధికారికో చెప్పడం మానేసి అందరూ సోనూ సూద్ ని కలవడం మొదలు పెట్టారు. కాస్త చదువుకున్నవారు ఎవరికి ఏ కష్టమొచ్చినా ట్విట్టర్ లో ఆయనకు లింక్ చేస్తూ ఓ పోస్టింగ్ పెట్టేవారు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానమిస్తూ అందరికీ చేతనైనంత సాయం చేస్తూ ఆదుకున్నారు సోనూ సూద్. అయితే సోనూ పేరుని వాడుకుంటూ ఇక్కడో మోసగాడు బరితెగించాడు. సోనూ సూద్ పేరుతో లోన్లు ఇప్పిస్తానంటూ ఓ మహిళ వద్ద 60వేల రూపాయలు కాజేశాడు.

    సోనూ సూద్ పేరు మీద ఓ లెటర్ హెడ్ తయారు చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన మోసగాడు.. 60 నెలల ఈఎంఐ చొప్పన రూ. 5 లక్షల లోన్ తీసుకునే విధంగా సోనూ సూద్ ఫౌండేషన్ ఓ పథకాన్ని ప్రవేశ పెట్టిందని ప్రకటించాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ బాధితురాలు ఇలాగే మోసపోయి విడతల వారీగా 60వేల రూపాయలు అతడికి ముట్టజెప్పింది. లోన్ పేరుతో మోసపోయింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్ లో ఉంచి ప్రజలకు అవగాహన కల్పించారు.

    https://twitter.com/CyberCrimePSCyb/status/1369180940740616195?s=20

    అటు సోనూ సూద్ కూడా.. తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తాను కానీ, తన ఫౌండేషన్ కానీ రుణాలు ఇస్తున్నట్టు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశాడు సోనూ సూద్. డబ్బుల కోసం కేటుగాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ లెటర్ హెడ్ ‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ‌లో పోస్ట్ చేసాడు. ఇటువంటి మాయగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోనూ సూద్ పేర్కొన్నాడు. తన పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ముంబాయితో పాటు యూపీ పోలీసులకు సోనూ సూద్ ఫిర్యాదు చేసాడు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..