టీవీ యాంకర్ గా మారిన హిజ్రా..

  0
  459

  మహిళా దినోత్సవం రోజు ఓ హిజ్రా ప్రముఖ టీవీలో యాంకర్ గా రంగప్రవేశం చేసింది. అనన్ శిశిర్ అనే పేరు గల ఈ ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్ కావాలన్న ఏకైక లక్ష్యంతో గత కొన్నేళ్లుగా కఠోర శ్రమతో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. బంగ్లాదేశ్ లో బొయిసాకి టీవీలో మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ గా రంగప్రవేశం చేసింది. శిశిర్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు చదివేందుకు స్కాలర్ షిప్ కూడా సంపాదించింది. లింగ వివక్షతపై ఎల్జీబీటీ కమ్యూనిటీ చేస్తున్న పోరాటంలో తానూ ఒక విజయాన్ని సాధించానని భావిస్తున్నట్టు తెలిపింది.

  హక్కులకోసం పోరాడుతున్న తమకు న్యాయం జరగాలని ట్రాన్స్ జెండర్లను కూడా మనుషుల్లాగే చూడాలనే లక్ష్యంతోనే తాము పనిచేస్తామని చెప్పింది. ఎన్నో అవమానాలు, వేధింపులు, ఎదుర్కొని తాను ఈ స్థితికి రాగలిగానని చెప్పింది. తండ్రి నిరాదరణతో 16వఏట ఇల్లు వదిలి పెట్టి వచ్చేశానని సాటి హిజ్రాలు ఆదరించి చదువు పట్ల తనకున్న శ్రద్ధను గమనించి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా తనను చదివించారని చెప్పింది. తన జీవితం మొత్తం హిజ్రాల సంక్షేమం కోసమే పనిచేస్తానని తెలిపింది. హిజ్రాలలో ఉన్న మేధస్సుని, సృజనాత్మక శక్తిని, అందులో ఉన్న అద్భుతమైన కళను, వివిధ రకాల కార్యక్రమాల ద్వారా వెలుగులోకి తెస్తానని చెప్పింది.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..