ఒక అమ్మాయికోసం ఇద్దరు ఆత్మహత్య .

  0
  407

  ఒక అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు అన్నదమ్ములు తమ ప్రేమ విఫలం కావడంతో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. సినిమా కథను మరిపించే ఈ సంఘటన రాజస్థాన్ లోని కోట కు సమీపంలోని గుడ్ల అనే గ్రామంలో జరిగింది. మహేంద్ర గుర్జార్, దేవరాజ్ గుర్జార్, అనే ఇద్దరు అన్నదమ్ములు.. ఆశా అనే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు చేతులమీద ఆ అమ్మాయి పేరు పచ్చబొట్టు పొడిచి ఉంటుంది. ఇద్దరు ఒకే అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ ప్రేమ బెడిసి కొట్టడంతో రైలు కిందపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఒకటిగానే రైలు పట్టాలపై కూర్చుని చివరిసారిగా తమ తల్లిదండ్రులకు వీడియో సందేశం పంపించారు. తామిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని, అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరం కలసి చనిపోతున్నామని చెప్పారు. తమ పెద్దలెవరూ తగాదాలు పడొద్దని కోరారు. అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి అంటూ ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కోరారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..