భర్త మృతదేహం కోసం 38 ఏళ్లు ఎదురుచూస్తూ.

    0
    397

    దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికులంటే అందరికీ ఎంతో గౌరవం.. దేశం కోసం సైనికులు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు.. అయితే కొన్ని సందర్భాల్లో ఆ సైనికుల వీర మరణానికి కనీస గుర్తింపు కూడా దక్కకపోవచ్చు. అసలు మరణించారో.. లేదో కూడా తెలియని సందర్భాలు కూడా సైనికుల కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఓ ఘటననే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

    చైనా, పాకిస్థాన్ ఎప్పుడూ కన్నేసి ఉంచే కార్గిల్ లోని సియాచిన్ ప్రాంతం.. మన దేశానికి చాలా కీలకమైన పాయింట్ ఇది.. 1984వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న 5965 అనే సరిహద్దు పాయింట్ కోసం మనదేశం ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. సముద్రమట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టేంత చలిగా ఉంటుంది. ఈ ఆపరేషన్ కోసం మన దేశ సైనికులు శత్రుదేశ సైనికులతో తీవ్రంగా పోరాడారు.

    ఆ ప్రాంతంలో శత్రు మూకలతో పోరాడి, లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే సైనికాధికారి మరణించారు. అయితే ఆయన మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. అప్పట్లో ఆయన మృతదేహం కోసం సైనికులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఆచూకీ లభించలేదు.. అప్పటినుంచీ ఆయన మృతదేహం కోసం చంద్రశేఖర్ సతీమణి, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తన భర్తను చివరిసారిగా చూడకపోతానా అనే ఆశతో ఆ ఇల్లాలు 38ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది.

    అయితే తాజాగా సియాచిన్ ప్రాంతంలో మనదేశ సైనికులకు చంద్రశేఖర్ మృత దేహం లభ్యమైంది. మరణించిన వారికోసం మనదేశ సైనికులు చేసే సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా గాలిస్తుండగా.. చంద్రశేఖర్ మృతదేహం కనిపించింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు.. చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వస్థలమైన ఉత్తరాఖండ్ హాల్ద్వానీ తీసుకొచ్చారు. ఆర్మీ అధికారులు అంతిమ సంస్కారాలను జరిపించారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.