ప్రియురాలు చేసిన చాట్ తో విమానం ఆగిపోయింది.

  0
  2468

  ప్రియురాలు ముచ్చటగా ప్రియుడితో చేసిన చాట్ తో విమానం ఆగిపోయింది.. ఎందుకంటె ఆ చాటింగ్ ని పక్కనున్న ఆవిడచూసి గగ్గోలు పెట్టేసింది.. దీంతో అలర్ట్ అయ్యారు.. పోలీసులు వచ్చేసారు.. విమానాన్ని చుట్టుముట్టేశారు.. చివరకు ఎమైందో చూడండి.. మంగుళూరు నుంచి బొంబాయి పోవాల్సిన ఇండిగో విమానం , మరికొద్ది సేపట్లో 186 మంది ప్రయాణికులతో సాయంత్రం 5 గంటలకు బయలుదేరేందుకు సిద్దమైంది.. ఆ టైంకి ఓ యువకుడు లవర్ తో చాటింగ్ చేస్తున్నాడు. పక్కనోళ్లు ఏమిచేస్తున్నారో చూసే ఎదవ బుద్ది చాలా మందికి ఉంటుందికదా ..?

  అలాగే ఆ యువకుడు సీటు పక్కనున్న మహిళ , అతడుచేసే చాటింగ్ దొంగచాటుగా చూస్తోంది. ప్రియురాలికేదో ,తన ప్రియుడు పెద్ద పోటుగాడు అని అనిపించింది. అదేమాట ఇంగ్లిష్ లో టైప్ చేసి పంపింది.. కాకపోతే నువ్వు పెద్ద బాంబర్ వి అని ముచ్చటగా చాట్ చేసింది. ఇది చూసిన ఆ మహిళ విమానంలో రచ్చ చేసింది. దీంతో విమానం ఆగిపోయింది. పోలీసువచ్చి అతడిని దించేసింది. అతడి లగేజి చెక్ చేసింది. చాట్ చూసిన మహిళను కూడా దించేసింది.

  తనది ఘోరక్ పూర్ అని , బొంబాయిలో ఒక కంపెనీలో ఐటి ఇంజనీర్ గా జాయిన్ అయ్యేందుకు పోతున్నానని చెప్పాడు. ఆమె తన లవర్ అని , డిగ్రీ చదువుతొందని తెలిపాడు. చాలాసేపటినుంచి తాను అమ్మాయితో చాటింగ్ చెస్తున్నానని చెప్పాడు. అదేదో తమాషాగా చేసిన కామెంట్ అని చెప్పాడు. ఈ విచారణలో విమానం ఆరు గంటలు నిలిచిపోయింది. సాయంత్రం విమానాన్ని పంపేసినప్పటికీ , యువకుడిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఢిల్లీలో అతడి లవర్ ని కూడా విచారిస్తున్నారు.. తమాషాగా చేసిన చాట్ ఇలా కొంప ముంచింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.