గొర్రె.. మంద బుద్ది కలదని అంటారు. ఏదైనా వింతైన పని లేదా విడ్డూరమైన పని చేసేటప్పుడు .. గొర్రె అని పిలుస్తుండడం చూసుంటాం. అందుకు కారణం.. గొర్రెల ప్రవర్తన మిగిలిన జంతువుల కంటే భిన్నంగా ఉంటుంది. అలాంటి ఘటనే చైనాలోని మొంగోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
గొర్రెల మంద వలయాకారంలో తిరుగుతున్న దృశ్యం వైరల్ గా మారింది. గొర్రెల మందలోని ఓ గొర్రె.. క్లాక్ వైజ్ లో తిరగడం మొదలుపెట్టింది. దాన్ని చూసి మిగిలిన గొర్రెలు కూడా అలాగే తిరగడం మొదలుపెట్టాయి. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల నుంచి ఇవి అలాగే తిరుగుతూ కనిపించాయి.
ఆ గొర్రెలేమైనా అనారోగ్యంతో ఉండి అలా చేస్తున్నాయా అంటే అదీ లేదు. అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయట. మరి వలయాకారంలో ఎందుకు తిరుగుతున్నాయనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఇవి కూడా చదవండి..