విమానం భోజనంలో తెగిన పాముతల..బెంబేలు.

  0
  1824

  రెస్టారెంట్లు, హోట‌ళ్ళ‌లో తినే భోజ‌నంలో ఈగ‌లు, దోమ‌లు క‌నిపిస్తుండ‌డం స‌హ‌జం. అన్నిచోట్లా ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయి. మ‌న దేశంలోనే కాదు .. విదేశాల్లోనూ ఇది వింతైన విష‌యం కాదు కూడా. కానీ విమానంలో స‌ర్వ్ చేసే భోజ‌నంలో ఏకంగా పాము త‌ల క‌నిపించింది. మ‌రి దీన్నేమ‌నాలి ? ట‌ర్నీ నుంచి జ‌ర్మ‌నీ వెళ్ళే ఓ విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  స‌న్ ఎక్స్ ప్రెస్ ఫ్ల‌యిట్ ఒక‌టి ట‌ర్కీ నుంచి జ‌ర్మ‌నీ వెళుతోంది. ఆ స‌మ‌యంలో భోజ‌న స‌మ‌యంలో అంద‌రికీ భోజ‌నాల‌ను స‌ప్ల‌య్ చేస్తున్నారు. ఇందులో ఫ్ల‌యిట్ అటెండెంట్ కి ఫుడ్ స‌ప్ల‌య్ చేశారు. ఆ భోజ‌నంలో కాజురోల్ కూడా ఉంది. అది స‌గం తిన్న త‌ర్వాత ఆ ఫ్ల‌యిట్ అటెండెంట్.. కాజురోల్ లో క‌నిపించిన పాము త‌ల‌ను చూసి బెంబేలెత్తిపోయాడు.

  అప్ప‌టికే అత‌ను సంగం తినేసి ఉన్నాడు. ఈ విషయాన్ని స‌న్ ఎక్స్ ప్రెస్ సంస్థ దృష్టికి తీసుకెళ్ళాడు. దీంతో స‌ద‌రు సంస్థ‌, ఫుడ్ స‌ప్ల‌య్ చేసిన కాంట్రాక్ట‌ర్‌పై యాక్ష‌న్ తీసుకుంది. కాంట్రాక్టుని ర‌ద్దు చేసి ఫిర్యాదు చేశారు. గ‌తంలోనూ ఈ స‌న్ ఎక్స్ ప్రెస్ విమానంలోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. పాడైపోయిన ఫుడ్ ను స‌ర్వ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయ‌ని .. ఇప్పుడు ఏకంగా పాము త‌ల‌నే స‌ర్వ్ చేశార‌ని స‌న్ ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం పేర్కొంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.