ఇద్దరు బాబుల భేటీలో లోగుట్టు ఇదేనా..?

  0
  357

  తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో హీరో మోహ‌న్ బాబు భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో అనేక అభిప్రాయాలు వినవస్తున్నాయి. . హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో ఈ భేటీ జ‌రిగింది.. తాజాగా చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు భేటీ కావ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక వేళ మోహన్ బాబు , టిడిపిలో చేరితే , అది టిడిపికి రాష్ట్రంలో ఎలాంటి అదనపు ప్రయోజనం కలిగించదు. సామాజిక సమీకరణాల్లో కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఆ సామాజికవర్గం 97 శాతం టిడిపితోనే ఉంది. కాకపోతే చిత్తూరు , తిరుపతి జిల్లాలో కాళహస్తి , చంద్రగిరి నియోజకవర్గాల్లో కొంతమేర మోహన్ బాబు తో సత్సంబంధం ఉపయోగపడొచ్చు. ఇంతకు మించి ఆయనతో కలయిక , టిడిపికి గానీ , చంద్రబాబుకి గానీ ఉపయోగం లేకపోవచ్చు..

  ఇదికాక ఇటీవల కాలంగా సినిమారంగానికి సంబంధించి , నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొన్ని వర్గాలు , బల్;బాలకృష్ణ , పరోక్షంగా పవన్ కళ్యాణ్ తప్ప , టిడిపికి హీరో , హీరోయిన్లు అనుకూలంగా లేరు. ఎన్టీఆర్ ని , చంద్రబాబు భరించలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వస్తే , లోకేష్ తెరమరుగైపోతాడు. అందువల్ల ఆ ప్రమాదాన్ని కొనితెచ్చుకోడు. ఇదికాక , మోహన్ బాబు , బీజేపీలో చేరతాడన్న ప్రచారంకూడా ఉంది. ప్రధాని మోడీతో భేటీ కాగల చనువుంది. అందువల్ల ఆ వైపు నుంచి బిజెపితో సంబంధాలు , పొత్తులకు , మోడీతో చెడిపోయిన సంబంధాల పునరుద్దరణకు , మోహన్ బాబు ఏమైనా ఉపయోగపడతాడా అన్న ఆలోచనకూడా లేకపోలేదు. చంద్రబాబు , తన పార్టీనుంచి బిజెపిలోకి పంపిన నేతలెవరూ , ఆ స్థాయిలో ఢిల్లీలో ఎదగలేదు. అందువల్ల వాళ్ళతో పెద్దగా ప్రయోజనంకూడా చేకూరలేదు. మోహన్ బాబు , చంద్రబాబు భేటీలో రాజకీయవర్గాల్లో వస్తున్న అనుమానాలివి ..

  గతంలో నంద‌మూరి తార‌క రామారావుతో అత్యంత స‌న్నిహితంగా ఉండే మోహ‌న్ బాబు… ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్య‌స‌భ స‌భ్యుడుగా కొన‌సాగారు.ఎన్టీఆర్ త‌ద‌నంత‌రం చంద్ర‌బాబు హ‌యాంలో పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా గ‌డిపారు. చంద్ర‌బాబుతో మాట్లాడ‌కుండా మిన్న‌కుండిపోయారు.వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో మంచు ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యింది. మోహన్ బాబు కొడుకు విష్ణు.. వైఎస్ సోదరుడి కుమార్తె విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది.

  తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ బకాయిల విషయమై టీడీపీ హ‌యాంలో చంద్ర‌బాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా సైతం చేపట్టారు.దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు మోహ‌న్ బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్ర‌మంలో వైసీపీతోనూ దూరం పెంచుకున్న మోహ‌న్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నాన‌ని, ఇక‌పై రాజ‌కీయాల జోలికి వెళ్ల‌నంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇప్పుడు ఈ భేటీ చర్చకు దారితీసింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.