హంటర్ 350..వేటగాడు వచ్చేశాడు.

  0
  6451

  రాయల్ ఎన్ ఫీల్డ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ఎందుకంటే ఏళ్లతరబడి భారతీయులకు ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ సుపరిచితమే.. ఏళ్లు గడుస్తున్నా తన రూపు మార్చుకుంటూ వాహనదారులను ఆకట్టుకుంటూనే ఉంది. బుల్లెట్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఎన్నో మోడళ్ళు భారతీయ మార్కెట్లోకి వస్తున్నా రాయల్ ఎన్ ఫీల్డ్ మాత్రం ఇప్పటికీ భారతీయుల హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

  తాజాగా తన హంటర్ 350 పేరుతో మరొక బైక్ ను లాంచ్ చేయబోతోంది. 7వ తేదీన అధికారికంగా ఈ బైక్ ను విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ బైక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎక్కడచూసినా ఈ బైక్ గురించే చర్చ జరుగుతోంది. అతి తక్కువ ధరకే ఈ బైక్ ను వినియోగదారులకు అందించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. లక్షా 70వేల రూపాయల మొదలు కొని ఈ బైక్ ధర ఉండొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభించనుంది.

  ఇక ఈ బైక్ ఫీచర్లను పరిశీలిస్తే.. 350సీసీ ఇంజిన్ కెపాసిటీ.. అలాయ్ వీల్స్ తో పాటుగా, రెట్రో మోడెల్ ఫోక్స్ లో అందుబాటులో ఉంది. ప్రధానంగా ఈ బైక్ స్మూత్ రైడ్ చేస్తున్న అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఈ బైక్ కు ఉండే ప్రధాన ఆకర్షణ, 35 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని అనుకుంటున్నారు. స్టైలిష్ హెడ్ లైట్, రాయల్ ఎన్ ఫీల్డ్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ బైక్ బ్యాక్ టైల్ కనిపిస్తోంది. ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 350 సీసీ ఇండియన్ బైక్ మార్కెట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 సంచలనాలు కలిగిస్తుందని కంపెనీ బలంగా విశ్వసిస్తోంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.