ప్రియుడికోసం చివరకు ఇలా చేసింది..ఘోరం..

  0
  449

  ప్రేమ పుట్ట‌నే కూడ‌దు. పుడితే, కుదురుగా ఉండ‌నీయ‌దు. మాయ చేస్తుంది. మంత్రం వేస్తుంది. నా అనుకున్న వారిని దూరం చేస్తుంది. ఒక‌రి కోసం ఒక‌రు బతుకుదాం అనేలా చేస్తుంది. కుద‌ర‌ని నాడు ఒక‌రి కోసం ఒక‌రు చ‌చ్చిపోదాం అన్నంత‌గా మార్చేస్తుంది. ప్రియురాలి కోసం తెగించేలా, ప్రియుడిగా కోసం ప్రాణ‌త్యాగం చేసేలా మార్చేస్తుంది ప్రేమ‌. వీళ్ళిద్ద‌రి ప్రేమ‌ కూడా అలాంటిదే.

  అస్సోం రాష్ట్రంలోని కామ‌రూప్ జిల్లాలోని సువ‌ల్ క‌చికి చెందిన ఓ యువ‌తికి ఫేస్ బుక్ లో ఓ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచయం కాస్తా ప్ర‌ణ‌యంగా మారింది. ఆ ప్ర‌ణ‌యాన్ని ప‌రిణ‌యంగా మార్చుకోవాల‌ని భావించింది ఆ యువ‌తి. ఇప్ప‌టికే మూడుసార్లు ఆ యువ‌తి త‌న ప్రియుడితో పరారైంది. అయినా ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు వెతికి ప‌ట్టుకుని మ‌రీ ఇంటికి తీసుకొచ్చారు. అయినా ఆ యువ‌తి మ‌న‌సు మాత్రం ప్రియుడి మీదే ల‌గ్న‌మైంది. అత‌నితో క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.

  కానీ విధిచిత్ర‌మైంది క‌దా.. ప్రేమికుడికి హెచ్ఐవీ సోకింది. అయినా స‌రే.. ఆ అమ్మాయి మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అత‌డితోనే క‌లిసి బ‌త‌కాల‌నుకుంది. దీంతో ఏకంగా ప్రియుడి ర‌క్తాన్ని త‌న‌లోకి ఎక్కించుకుంది. ప్రియుడితో పాటు తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోయింది. విషయం తెలిసిన యువతి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. ప్రియుడిని పెళ్లి చేసుకున్నా తమను కుటుంబ‌స‌భ్యులు విడదీస్తారని భయపడి, తాను ఇలా చేసిన‌ట్లు ఆ యువ‌తి చెప్ప‌డం విశేషం.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.