కృష్ణం రాజు మృతికి నివాళి ఇలాగేనా..?

  0
  415

  కాంట్ర‌వ‌ర్శ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఆక‌స్మిక మృతి నేప‌ధ్యంలో వ‌ర్మ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ అయింది. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో వ‌రుస ట్వీట్లు చేశారు.

  మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం.

  మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.

   

  నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్ కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

  భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం.. ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!

   

  రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు వ‌ర్మ‌.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.