ఒక్కో దఫా కొన్ని సంఘటనలు చెప్తే నమ్మలేం. కానీ కొన్ని నమ్మి తీరాల్సిందే. 87 ఏళ్ళ ఓ వృద్దురాలు హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని చేసిన ఫిర్యాదు సంచలనం కలిగించింది. గుజరాత్ లోని వడోదరాలో 89 ఏళ్ళ భర్త 87 ఏళ్ళ భార్య చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇంత వృద్దాప్యంలో కూడా భర్తకు లైంగిక వాంఛలు తగ్గలేదట. తనను నిరంతరం లైంగికంగా కోరికలు తీర్చమని వేధిస్తున్నాడని, ఆరోగ్యం బాగా లేకపోయినా ఇబ్బంది పెడుతున్నాడని ఆ వృద్దురాలు 181 అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి చెప్పింది.
మహిళల కష్టాలు, సమస్యలు, వేధింపులు చెప్పుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం 181 అభయం హెల్ప్ లైన్ తీసుకొచ్చింది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ వృద్ద దంపతులతో కొడుకు, కోడలు కూడా ఉంటున్నారు. ఇంత వయసులో కూడా లైంగిక పరమైన కోరికలు ఎక్కువ అవుతున్నాయని, అందువల్ల భర్త వేధింపుల నుంచి రక్షించాలని ఆమె కోరింది.
దీంతో 181 అభయం హెల్ప్ లైన్ సిబ్బంది హుటాహుటిన ఆమె ఇంటికి వచ్చేశారు. భర్త లైంగిక వేధింపుల విషయంలో తామేమీ చేయలేమని చెప్పి, మూడు ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు. భార్య అనారోగ్యంతో అలసిపోయినప్పుడు ఇబ్బంది పెట్టవద్దని, ఉదయం లేస్తూనే వాకింగ్ కి వెళ్ళమని, ఆ తర్వాత యోగా చేసుకోమని, మనసు దారి మళ్ళేందుకు దేవాలయాలకు వెళ్ళమని సలహా ఇచ్చి పోయారు.
ఇవి కూడా చదవండి..