పెళ్ళైన తరువాత క్రికెట్ కు ఒప్పుకోవాలంటూ.

  0
  384

  పెళ్ళైన తరువాత క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవాలంటూ , పెళ్ళికొడుకు , అతడి స్నేహితులు పెళ్లికూతురుచేత అగ్రిమెంట్ రాయించారు. ఒక బాండ్ పేపర్ మీద సంతకం కూడా చేయించారు. ఇదంతా , పెళ్లిమండపంలోనే జరిగింది.. వీకెండ్స్ లో , భర్తను ఇంట్లో కట్టిపడేయకుండా , క్రికెట్ ఆడేందుకు పోనీయకుండా చేస్తుందేమోనని ఇలా చేశామని చెప్పారు. ఇదంతా , పెళ్లిమండపంలోనే జరగడం విశేషం

   

  తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలింబట్టు నగరంలో ఈ చోద్యం చోటు చేసుకుంది. ఈ టౌన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే హరిప్రసాద్ కి , మధురైకి చెందిన పూజతో పెళ్లయింది. హరిప్రసాద్ కి క్రికెట్ అంటే ప్రాణం.. వీకెండ్స్ లో , ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతాడు., పెళ్ళైన తరువాత , భర్తను క్రికెట్ ఆడనీయకుండా చేస్తుందేమోనని ఫ్రెండ్స్ , పెళ్లిలోనే ఆమెచేత అగ్రిమెంట్ రాయించి , సంతకం పెట్టించారు.. ఇదో రకం కొత్త ట్రెండ్..

   

  ఇదిలా ఉంటె ఒరిస్సాలో కూడా , పెళ్లిమండపంలోనే , పెళ్లికూతురు , పెళ్ళికొడుకు చేత 8 అంశాలలో భార్య మాటే వింటానని , ఒక అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంది. . అందులో రోజూ పిజ్జాలు తిననని , నెలలో ఒక్క పిజ్జామాత్రమే తింటానని ,చీటికిమాటికి హోటల్ కి పోకుండా ఇంట్లో బోజనమే చేస్తానని , చీర మాత్రమే కట్టుకునేందుకు ఒప్పుకోవాలని , ఫ్రెండ్స్ తో పార్టీకిపోతే వెంట తానూ ఉండాలని , 10 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలని , డ్రింక్ తీసుకోకూడదని , ప్రతిరోజూ ఉదయమేలేచి ఇంట్లోనే జిమ్ చెయ్యాలని .. ఇలాంటి షరతులు పెట్టింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.