బైక్ లో టపాకాయలు తీసుకుపోతూ జరిగిన భారీ పేలుడులో ఇప్పుడు నిజాలు బయటకొస్తున్నాయి.. చనిపోయిన వ్యక్తి అరియాకుప్పంకు చెందిన కలియనేషన్ , అతడి ఏడేళ్ల కొడుకు.. దీపావళికి టపాకాయలు అమ్ముకునేందుకు , పాండిచ్చేరినుంచి రెండు బస్తాల్లో నాటు టపాసులు తెచ్చాడు. వీటిని శక్తివంతమైన పేలుడు ఉండేట్టు తయారుచేస్తారు. రెండు బస్తాల , నాటు టపాసులను , స్కూటీ ముందు , ఒకదానిపై ఒకటి ఉంచి , వాటిమీద తన ఏడేళ్ల బిడ్డను కూర్చోబెట్టాడు. వీటిని అమ్ముకునేందుకు బయలుదేరి కోటకుప్పం వద్దకొచ్చాడు. టపాకాయలమీద వత్తిడి , స్కూటీ ఇంజిన్ నుంచి వచ్చిన వేడి , కారణంగా ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగిందని నిర్థారించారు. ఈ పేలుడులో తండ్రి , కొడుకుల శవాలు 15 అడుగుల ఎత్తు ఎగిరాయి.. పేలుడు జరిగిన స్కూటీ పక్కనేపోతున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలై , వారుకూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు..
A father-son duo was killed and three others were injured when a bag of country fireworks they were carrying in their motorcycle exploded accidentally at Kottakuppam town on Thursday afternoon. pic.twitter.com/VknP6ebDU4
— Express Chennai (@ie_chennai) November 5, 2021