అద్భుతమైన ఊహ.. కన్నీళ్లు తెప్పించే చిత్రం..

  0
  1458

  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి ఓ అలవాటు ఉంది. తానెవరో తెలియకుండా అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటారు. యువరత్న సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆయన ఇలాగే చేశారు. వెనకనుంచి వచ్చి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి.

  తాజాగా పునీత్ మరణంపై వచ్చిన ఓ పెయింటింగ్ అభిమానుల్ని కట్టిపడేసింది. మరణం తర్వాత స్వర్గంలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లిన పునీత్.. వెనకనుంచి వచ్చి ఆయన కళ్లు మూస్తాడు. అప్పాజీ చెప్పు నేనెవరో అన్నట్టుగా ఆ ఫొటో ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ గా మారింది. కన్నడ నటీనటులతోపాటు, ఆయన అభిమానులంతా ఈ ఫొటోనే తమ డీపీగా పెట్టుకోవడం విశేషం.

  కరణ్ ఆచార్య అనే పెయింటర్ ఈ చిత్రాన్ని గీశాడు. మొదటగా తన ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫోటో బొగా ఫేమస్ అయింది. గతంలో యాంగ్రీ హనుమాన్ అనే పెయింటింగ్ తో కరణ్ ఆచార్య బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం కన్నడ సినిమాలకు ఇతను పనిచేస్తున్నాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..