పవన్.. ప్రాణం పోతోంది.. ఒక్కసారి చూసిపోవా.

    0
    1131

    పవన్.. ప్రాణం పోతోంది..ఒక్కసారి చూసిపోవా..
    ===============
    పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల ఆరాధ్యదైవం. ఆయనను కేవలం తెర మీద హీరోగా మాత్రమే కాదు.. గుడిలో దేవుడి కంటే ఎక్కువగా అభిమానించే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. అయితే ఆలాంటి అభిమానుల్లో ఓ అభిమానికి ఇప్పుడు ప్రాణం మీదకు వచ్చింది.

    కాకినాడకు చెందిన నాగ వెంకటేశ్వర రావు అనే యువకుడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఎంతలా అభిమానం అంటే, చేతిమీద పచ్చబొట్టు వేయించుకునేంత పిచ్చిగా, పవన్ ను ప్రేమిస్తాడు. ఇటీవల వెంకటేశ్వర రావు రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

    అయితే వెంకటేశ్వర రావు తల్లిదండ్రులు మాత్రం పవన్ ను ఓ కోరిక కోరుతున్నారు. తమ కొడుకును ఒక్కసారి పవన్ కళ్యాణ్ వచ్చి చూడాలని వేడుకుంటున్నారు. పవన్ ను కలిస్తే తమ కొడుకు కోలుకుంటాడని చెబుతున్నారు. ఈ మేరకు న్యూరో స్టార్ హాస్పిటల్ యజమాన్యానికి ఓ లేఖ రాశారు. అయితే ఈ లేఖ పవన్ వరకూ వెళ్తుందో లేదో చూడాలి.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..