డోలో మాత్రల్లో అవినీతిపై సుప్రీంలో కేసు.

    0
    581

    డోలో టాబ్లెట్స్ క‌రోనా కాలంలో కుప్ప‌లు తెప్ప‌లుగా అమ్ముడ‌య్యాయి. డోలో మాత్ర‌ల అమ్మ‌కాల్లో కుంభ‌కోణాన్ని .. ఈ మాత్ర‌లు ప్రిస్క్రిప్ష‌న్ లో రాసినందుకు డాక్ట‌ర్ల‌కు వెయ్యి కోట్ల రూపాయ‌ల క‌మీష‌న్, ఈ వ్య‌వ‌హారాల‌పై కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు విచార‌ణ‌లో నిజాలు బ‌య‌టికొచ్చాయి. మందుల కంపెనీల‌కు అమ్ముడుపోయిన డాక్ట‌ర్లు.. ఎన్ని ఘోరాలు, దారుణాలు చేస్తారో.. డోలో మాత్ర‌ల అమ్మ‌కంలో కుంభ‌కోణంలో బ‌హిర్గ‌తం చేసింది. ఈ విష‌య‌మై సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. డాక్ట‌ర్ల‌కు మందుల కంపెనీలు ఇచ్చే క‌మీష‌న్ ను.. లంచాల కిందే ప‌రిగ‌ణిస్తామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌మీష‌న్లు తీసుకున్న డాక్ట‌ర్లు కూడా ఈ కేసులో నిందితులేన‌ని పిటీష‌న్ దాఖ‌లు చేసిన స్వ‌చ్చంద సంస్థ వాదిస్తోంది.

    ఇవ‌న్నీ ఇలావుంటే డోలో టాబ్లెట్స్ 650 ఎంజీ డోసేజ్ లో అమ్మ‌కాలు సాగించ‌డం వెన‌క మ‌రో పెద్ద కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. సాధార‌ణంగా ఒక టాబ్లెట్ 500 మి.గ్రా దానికంటే త‌క్కువ‌గా ఉంటే.. ఆ ట్యాబ్లెట్ ధ‌ర‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. 500 మి.గ్రా దాటితే, మందుల కంపెనీయే ఆ ధ‌ర‌ను నిర్ణ‌యించుకోచ్చు. ప్ర‌పంచంలో ఎక్క‌డా కూడా 650.మి.గ్రా పారాసెట్మోల్ ర‌సాయ‌నం అమ్మ‌కం నిషిద్దం. అంత డోసేజ్ వేయ‌డం కూడా విదేశాల్లో ఒప్పుకోరు. అయితే మ‌న దేశంలో ప్ర‌భుత్వం అంత డోసేజ్ మాత్ర‌కు ఎలా ఇచ్చిందో..? దాని ధ‌ర‌ను ఎలా నిర్ణ‌యించుకునే అధికారం మందుల కంపెనీల‌కు ఎందుకిచ్చారో.. ? డాక్ట‌ర్ల‌కు వెయ్యి కోట్ల క‌మీష‌న్ ఎలా ముట్ట‌జెప్పిందో…? అన్ని తెలిసి కూడా, కేంద్ర‌ప్ర‌భుత్వం ఎలా ఊరుకుందో అని స‌ద‌రు స్వ‌చ్చంద సంస్థ త‌మ లాయ‌ర్ల ద్వారా సుప్రీంకోర్టుకు విన్న‌వించింది. ప‌న్ను ఎగ‌వేత‌పై కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల విభాగం దృష్టి పెట్టిందే గానీ… ఈ మాత్ర‌ల వెన‌క ఎంత పెద్ద కుంభ‌కోణం దాగి ఉంద‌నే విష‌యంపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం శోచ‌నీయం.

    మెడిక‌ల్ కౌన్సిల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం డాక్ట‌ర్లు మందుల త‌యారీ కంపెనీల నుంచి ఎలాంటి గిఫ్టులు, పారితోషికాలు, విదేశీ ప్ర‌యాణాల టిక్కెట్లు, విందులు వినోదాలు, క‌మీష‌న్లు తీసుకోకూడ‌దు. ఒక‌వేళ తీసుకున్న‌ట్లు రుజువైతే.. వారి ప్రాక్టీసు లైసెన్సును ర‌ద్దు చేయ‌చ్చు. అందువ‌ల్ల డోలో మాత్ర‌ల కుంభ‌కోణంలో డాక్ట‌ర్ల‌ను కూడా నిందితులుగా చేర్చాల‌ని స్వ‌చ్చంద‌సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటీష‌న్ పై .. ఇప్పుడు వాద‌న‌లు మొద‌ల‌య్యాయి.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.